ట్రంప్ కు ఎన్ని ఎదురుదెబ్బలు..?

Update: 2017-02-10 06:30 GMT

అగ్రరాజ్య అధిపతి డొనాల్డ్ ట్రంప్ కు మరో షాక్ తగిలింది ముస్లిం దేశాల పౌరులనూ ట్రంప్ సర్కార్ విధించిన ఆంక్షలను 9వ సర్క్యూట్ అమెరికా అప్పీల్ కోర్టు తిరస్కరించింది. ఏడు దేశాలకు చెందిన ముస్లిం పౌరులకు మూడు నెలలపాటు అమెరికాలో ప్రవేశించకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అప్పీల్ కోర్టు కూడా తప్పు పట్టింది. ఆంక్షలపై ట్రంప్ ఉత్తర్వులను పునరుద్ధరించడానికి అప్పీల్ కోర్టు నిరాకరించింది. దీంతో ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముందని చెబుతున్నారు.

సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు....

ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ కు ఆదేశాలు జారీ చేసిన సగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాలో కూడా నేటికీ నిరసనలు కొనసాగతున్నాయి. ట్రంప్ ఆదేశాలపై కొన్ని సంస్థలు సియాటల్ డిస్ట్రిక్ట్ కోర్టు స్టే విధించింది. సియాటల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అమెరికా న్యాయశాఖ శాన్ ఫ్రాన్సిస్ కోలోని 9వ సర్క్యూట్ అప్పీల్ కోర్టును ఆశ్రయించింది. అయితే ఇక్కడ కూడా ట్రంప్ కు చుక్కెదురయింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది. న్యాయస్థానం తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ ట్విట్టర్లో స్పందించారు. ‘అమెరికా భద్రతకు ముప్పు ఉందని, కోర్టులో చూసుకుందాం’ అని ట్వీట్ చేయడంతో దీన్ని ట్రంప్ వదిలేడులా లేడన్నది అర్ధమయింది. అయితే అప్పీల్ కోర్టు తీర్పుపై అమెరికన్ సివిల్ లిబర్టీ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Similar News