అద్వానీకి అంత అసహనమెందుకు?

Update: 2017-02-22 23:30 GMT

బీజేపీ కురువృద్ధుడు లాల్‌ కృష్ణ అద్వానీ అసహనంతో రగిలిపోతున్నారు. భారత రాష్ట్రపతి కావాలనే అద్వానీ కలలు నెరవేరే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. బీజేపీ సీనియర్ల నుంచి కనీస మద్దతు లభించకపోవడం అద్వానీ ని మానసికంగా కుంగదీస్తోందట. ఒకప్పుడు అద్వానీ కరుణ కోసం పాకులాడిన నేతల్ని..., రాష్ట్రపతి అభ్యర్ధిత్వం కోసం రాయబారం వహించమని కోరే పరిస్థితి రావడంపై తల్లడిల్లిపోతున్నారట.

ఫలించని రాయబారాలు....

రెండువారాల క్రితం ఐదుగురు కేంద్రమంత్రులతో అద్వానీ నివాసంలో విందు భేటీ జరిగింది. అందులో అనంతకుమార్‌., రవిశంకర్‌ ప్రసాద్‌., తవార్‌ చంద్‌ గెహ్లాట్‌లు కూడా ఉన్నారు. వాళ్లందరి సమక్షంలో రాష్ట్రపతి కావాలన్న తన అకాంక్షను అద్వానీ నిర్మోహమాటంగా వెల్లడించారట... తన అభిలాషను మోదీకి చేరవేయాలని వారిని కోరడంతో అంతా సుముఖత వ్యక్తం చేశారని అయితే ఒక్కరు కూడా మాట నిలబెట్టుకోలేదట. ఇది అద్వానీ ని మరింత కుంగదీసిందట. బయటకు చెప్పుకోలేక ఈ లెజెండ్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారట.

ఎదురుచూపులే మిగిలాయి.....

కేంద్రమంత్రులుగా ఉన్న వారు తనకు ఊరటనిస్తారని భావించిన అద్వానీ వారు తెచ్చే సమాచారం కోసం రెండ్రోజులకు పైగా ఎదురు చూశారట. ఆ తర్వాత ఆయనే అనంతకుమార్‌కు ఫోన్‌ చేసి సమాచారం కోరితే మోదీ అంత ఆసక్తి చూపడం లేదనే విషయాన్ని ముక్తసరిగా తెలిపారట. నిజానికి ఇటీవల పార్లమెంటులో చోటు చేసుకున్న పరిణామాల వల్ల అద్వానీ అన్ని పార్టీల వారితో కలిసే అవకాశాలను కోల్పోయారు. నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకపోవడం అద్వానీ కి అసంతృప్తికి గురిచేశాయి. ఈ విషయాన్ని అద్వాని కుండబద్దలు కొట్టేయడంతో అదే చేటు తెచ్చిందంటున్నారు. పార్టీల నేతలతో ప్రత్యక్ష సంబంధాలున్న అద్వానీ గత అనుభవాలకు భిన్నంగా శీతాకాల ., బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు లాబీల్లో అందరికి కనిపించారట., అన్ని పార్టీలను ప్రసన్నం చేసుకునే క్రమంలోనే అద్వానీ పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో అందరితో ఉల్లాసంగా మాట్లాడేందుకు సిద్ధమైనా ...మోదీ అనుసరిస్తున్న విధానంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో మోదీ హవా నడుస్తున్న సమయంలో అటు సంఘ్ పరివార్‌, ఇటు బీజేపీల నుంచి తగిన మద్దతు అద్వానీ కి లభించడం కష్టమే..... ఇందుకు వేరే కారణాలు చాలా ఉన్నాయి. తాను పెంచి పోషించిన వర్గాలే తనకు మద్దతునివ్వని వేళ., అద్వానీ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలకూ తలుపు తట్టారట.... అడ్వానీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి....? తరువాయి భాగంలో....

Similar News