వారంతా జగన్ వైపేనా....??

Update: 2018-12-18 14:30 GMT

శ్రీకాకుళం జిల్లాలో కళింగ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడ మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉంటే దాదాపుగా అన్ని చోట్లా వారి ఉనికి ఉంది. ప్రత్యేకించి శ్రికాకుళం పట్టణంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపును ప్రభావం చేసే స్థాయిలో ఈ కులం ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వీరిపై దృష్టి సారించారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర శ్రికాకుళం జిల్లాలో సాగుతోంది. ఈ సందర్భంగా కళింగ లకు తగిన న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా భరోసా ఇచ్చారు. దీంతో జిల్లాలో టీడీపీ, వైసీపీల మధ్య ఇపుడు ఈ కులం మద్దతుపై పెద్ద ఎత్తున మాటల యుధ్ధమే సాగుతోంది.

రాజకీయ ఉనికి కోసమే....

కళింగ లు వఛ్చే ఎన్నికల్లొ రాజకీయంగా ఉనికి చాటాలనుకుంటున్నారు. ప్రతి ఎన్నికల ముందు రాజకీయ పార్టీలకు వారు ఇదే రకమైన విన్నపాలు చేస్తూ వస్తున్నారు. జగన్ ను కూడా వారు ఈ విషయమై కోరినపుడు ఆయన హామీ ఇస్తూ వారిని రాజకీయంగా ముందుకు తీసుకుపోతామని చెప్పుకొచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ సీటుని కళింగలకు కేటాయిస్తామని కూడా జగన్ స్పష్టంగా చెప్పారు. అలాగే వారి కోసం ప్రత్యేకంగా కార్పోరేషన్ కూదా ఏర్పాటు చేసి పేదలను ఆదుకుంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా కళింగ కులస్థుల మద్దతు అంతా వైసీపీకే అని ఆ పార్టీ నాయకులు పేర్కోంటున్నారు.

వారు మా వైపే...

దీనిపై ఆగ్రహిస్తున్న అధికార టీడీపీ నాయకులు కళింగలు మొదటి నుంచి టీడీపీ వైపునే ఉన్నారని పేర్కొన్నారు. వారి బాగోగులు చూసింది కూడా తమ పార్టీయేనని, రాజకీయంగా వారికి అన్ని అవకాశాలు తామే కలిపిస్తున్నామని అంటున్నారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కళింగ లను బీసీ జాబితాలో చంద్రబాబు చేర్చారని శ్రికాకుళం నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటెష్ చెప్పారు. ఇక శ్రీకాకుళం మేయర్ సీటుని కూడా వారికే కేటాయిస్తున్నామని వెల్లడించారు. వారు ఎప్పటికీ టీడీపీ వైపే ఉంటారని అయన ధీమాగా చెప్పారు.

వ్యతిరేకత ఉంది...

ఇదిలా ఉండగా కళింగల ప్రధాన వృత్తి వ్యాపారం, కేంద్రం జీఎస్టీ విధించడం వల్ల వారంతా ఇపుడు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీతో నాలుగేళ్ళ పాటు పొత్తు పెట్టుకుని అధికారంలో ఉన్న టీడీపీ పట్ల కూడా వారికి వ్యతిరేకత ఉంది. తమకు అన్యాయం జరిగేలా జీఎస్టీ ఉంటే కనీసం వెసులుబాటు కోసం టీడీపీ సర్కార్ ఏమీ చేయలేదని ఆవేదన వారిలో ఉంది. ఈ నేపధ్యంలో ప్రజా వ్యతిరేకతకు తోడు పదవులు కూడా రాజకీయంగా ఇవ్వకపోవడం, ఎన్నికలు జరగని కార్పోరేషన్ కి మేయర్ పదవి ఇస్తామని చెప్పడం వంటి వాటి కారణంగా మెజారిటీ కళింగలు ఇపుడు టీడీపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. జగన్ పాదయాత్రకు వారంతా పెద్ద సంఖ్యలో వెళ్ళడంతో అధికార పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగుతోంది.

Similar News