రాహుల్ రాములమ్మ మాట విని ఉంటే ....?

Update: 2018-12-13 05:00 GMT

తెలంగాణ లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. అలాంటి స్టార్ క్యాంపెయినర్ నెత్తి నోరు కొట్టుకుని టిడిపి తో పొత్తు వద్దన్నా రాహుల్ పెడచెవిన పెట్టారుట. ఇదే విషయాన్నీ స్వయంగా మెదక్ కాంగ్రెస్ కార్యకర్తలతో చెప్పుకుని తన ఆవేదన వ్యక్తం చేశారట రాములమ్మ. కడుపు చింపుకుంటే కాళ్ళమీద పడిందన్నట్లు ఇప్పుడిప్పుడే టిడిపి తో పొత్తు అంశంలో తమ వ్యతిరేకతను నెమ్మది నెమ్మదిగా వ్యక్తం చేస్తున్నారు.

బదిలీ కానీ ఓటు ...

వాస్తవానికి తెలంగాణ లో బలమైన క్యాడర్ తెలుగుదేశం ఆస్తి. కానీ లీడర్ లేని సేన ఎటు పోతుందో తెలియదన్నట్లు చెల్లా చెదురైపోయింది టిడిపి బలం. దీనికి కారణం చంద్రబాబు నిన్నమొన్నటి ఎన్నికల వరకు టిటిడిపి పనితీరును పరుగులు పెట్టించలేదు. ఫలితంగా చురుకైన వారంతా అధికారపార్టీ లేదా కాంగ్రెస్ లో చేరిపోయారు. కొందరు పూర్తిగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆ తరువాత తెలంగాణ ఎన్నికలు రావడం కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తుతో పాటు సిపిఐ, తెలంగాణ జనసమితి లను సైతం కలుపుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు పక్కా వ్యూహం రచించారు. అంతా బాగానే వుంది. స్వయంగా చంద్రబాబు కాలికి బలపం కట్టుకు తిరిగి ప్రచారం చేసినా పని జరగలేదు.

చేతులు కాలాక ఆకులు ...

టిడిపి ఓటు కాంగ్రెస్ కి బదిలీ కాకపోవడం, హస్తం క్యాడర్ సైకిల్ కి వేయలేకపోవడంతో రెండు పార్టీలు చతికిల పడిపోయాయి. దశాబ్దాల కాలం ప్రత్యర్థులుగా క్షేత్ర స్థాయిలో పోరాటం చేసినవారిని మిత్రులుగా చుడాలిసి రావడం కాంగ్రెస్ క్యాడర్ జీర్ణించులకోలేక పోయింది. సేమ్ టూ సేమ్ అదే పరిస్థితి టిడిపి క్యాడర్ లో వుంది. దాంతో మహాకూటమితో కొత్త జండా తెలంగాణ గడ్డపై ఎగురవేయాలన్న చంద్రబాబు ఆలోచనలు రివర్స్ కొట్టాయి. ఇలాంటి పరిణామం విజయశాంతి వంటివారు ముందే గ్రహించినా అధిష్టానం ఆమె మాట తీసిపారేయడం కాంగ్రెస్ పరాజయాన్ని ఖాయం చేసింది. అయితే ఇప్పుడు ఫలితాలు వచ్చాక అయిపోయిన ఎన్నికల కోసం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారిపోయింది

Similar News