బాబు.. ఇప్పుడేం చెబుతారు..!

Update: 2018-12-10 11:00 GMT

తెలంగాణా ఎన్నిక‌లు ముగిశాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్ తిరిగి అదికారంలోకి వ‌స్తుందా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి! ఇక్క‌డ నిర్వ‌హించిన అనేక స‌ర్వేల తాలూకు ఫ‌లితం కూడా టీఆర్ ఎస్‌కు ఎక్క‌డా అనుకూలంగా రాలేదు. పూర్తి స్థాయిలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చస్తుంద‌న్న భ‌రోసా కూడా ఎక్క‌డా క‌ల‌గ‌లేదు. ఈ విష‌యంలో మ‌హాకూట‌మి నాయ‌కుల మాదిరి గానే టీఆర్ ఎస్ నాయ‌కులు, ఎమ్మెల్యేలు కూడా భారీ ఎత్తున టెన్ష‌న్ ప‌డుతున్నారు. అయితే, ఎన్నిక‌ల ముందు విష యానికి వ‌స్తే.. అన్నీ బాగున్నాయ‌ని,.. మంచి స‌మ‌యం ఎంచుకుని మ‌రీ తాము ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేశామ‌ని సీఎం కేసీ ఆర్ వెల్ల‌డించారు.

కేసీఆర్ సర్వేలు....

దాదాపు త‌న ప్ర‌భుత్వంపై 17 స‌ర్వేలు సొంత‌గా చేయించుకున్న‌ట్టు ఆయ‌న మీడియాకే చెప్పారు. ప్ర‌తి ఒక్క ఎమ్మెల్యే పైనా స‌ర్వే చేయించాన‌ని, ఆ త‌ర్వాతే టికెట్లు ఇచ్చామ‌ని, 100 సీట్ల‌కు పైగానే త‌మ ఖాతాలో వేసుకుంటామ‌ని కేసీఆర్ చెప్పు కొచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు ఎంత మంది ఎమ్మెల్యేలు తిరిగి గెలుస్తారు అంటే... చెప్ప‌లేని ప‌రిస్తితి నెల‌కొంది. అంటే.. స‌ర్వేల‌కు ప్ర‌జా నాడి అంద‌లేద‌ని చెప్పుకోవాలి! పైకి బాగానే ఉన్న‌ట్టు క‌నిపించినా.. అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు ప్ర‌చార స‌మ‌యంలో ప్ర‌జ‌లు చుక్క‌లు చూపించారు. అంటే కేసీఆర్ సర్వేలు పెద్ద‌గా ప‌నికి వ‌చ్చిన దాఖ‌లా క‌నిపించ‌లేదు.

ఏపీలోనూ అంతేనా...?

క‌ట్ చేస్తే. ఇప్పుడు మ‌రో నాలుగు మాసాల్లోనే ఏపీలోనూ ఎన్నిక‌లు ఉన్నాయి. ఇక్క‌డ కూడా సీఎం చంద్ర‌బాబు..స‌ర్వేల బాబుగా పేరు తెచ్చుకున్నారు. మ‌రి ఈ స‌ర్వేలు . తాజాగా తెలంగాణాలో మాదిరిగా మార‌తాయా?; అనే సందేహాలు ఇప్పు డు తెర‌మీదికి వ‌స్తున్నాయి. కేవ‌లం స‌ర్వేల ఆధారంగానో.. ఐవీఆర్ ఎస్ స‌మాచారం ఆధారంగానో టికెట్లు కేటాయిస్తే. ఇప్పుడు తెలంగాణాలో ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ ప్ర‌చారంలో ఎదుర్కొన్న విధంగా ఇక్క‌డ కూడా ఏదైనా తేడా వ‌స్తే ప‌రిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ విష‌యంపైనే ఏపీలో చ‌ర్చ సాగుతోంది. కేవ‌లం స‌ర్వేల ఆధారంగా కాకుండా.. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యే చేస్తున్న ప‌నులు, వ‌స్తున్న ఆద‌ర‌ణ‌. ప్ర‌జాటాక్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటేనే బెట‌ర్ అనే వ్యాఖ్య వినిపిస్తోంది. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి.

Similar News