పెద్దిరెడ్డిని కంట్రోల్ చేస్తే చాలట

ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాల్లో బలమైన నేతలను కట్టడి చేయగలిగితే మిగిలిన నియోజకవర్గాలను సొంతం [more]

Update: 2021-09-08 06:30 GMT

ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాల్లో బలమైన నేతలను కట్టడి చేయగలిగితే మిగిలిన నియోజకవర్గాలను సొంతం చేసుకోవచ్చన్న ఆలోచన చేస్తున్నారు. తన సొంత జిల్లా అయిన చిత్తూరుపై చంద్రబాబు ఫోకస్ పెంచారు. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కట్టడి చేయగలిగితే 90 శాతం విజయం సాధించినట్లేననన్నది చంద్రబాబు ఆలోచన.

సొంత జిల్లాలో…

అందుకే ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత జిల్లా చిత్తూరులో అనేక నియోజకవర్గాలను దెబ్బతీస్తున్నారన్నది చంద్రబాబు భావన. ఆర్థికంగా వైసీపీ నేతలకు అండగా ఉండటంతో పాటు తమ పార్టీ నేతలను కూడా ప్రభావితం చేస్తున్నారని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కంట్రోల్ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం పార్టీ నేతలతో తరచూ సమావేశమవుతున్నారు.

కుప్పంలోనూ….

మొన్నటి ఎన్నికల్లోనూ చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గం నుంచి అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదు. ఈ రెండున్నరేళ్ల కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. తమ పార్టీకి చెందిన నేతలపై సామ,దాన, దండోపాయాలను ప్రదర్శిస్తున్నారు. దీంతో కుప్పంలోనూ టీడీపీ క్యాడర్ డీలా పడింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకు దాదాపు ఐదారు నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

బలమైన నేతను….

అందుకోసమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు టార్గెట్ చేశారు. ఇందుకోసం సరైన నేతను పుంగనూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించాలని నిర్ణయించారు. మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డికి అక్కడ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆయనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ధీటైన నేతగా చంద్రబాబు అనుకుంటున్నారు. వీరితో పాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అన్ని జిల్లాల్లో ప్రభావితం చేసే వైసీపీ నేతలపైనే చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు కనపడుతుంది.

Tags:    

Similar News