Pattabhi : పట్టాభి పారిపోయాడా? పంపించేశారా?

నిజమే… పట్టాభి విదేశాలకు ఎందుకు వెళ్లాడు? భయపడ్డాడా? లేక రిఫ్రెష్ మెంట్ కోసం వెళ్లాడా? కానీ పట్టాభి అలాంటి వాడు కాదే. ఫైర్ ఉన్న మనిషి. అలా [more]

Update: 2021-10-27 00:30 GMT

నిజమే… పట్టాభి విదేశాలకు ఎందుకు వెళ్లాడు? భయపడ్డాడా? లేక రిఫ్రెష్ మెంట్ కోసం వెళ్లాడా? కానీ పట్టాభి అలాంటి వాడు కాదే. ఫైర్ ఉన్న మనిషి. అలా చెప్పాపెట్టకుండా ఎందుకు చెక్కేశాడు. ఇవీ ఇప్పడు తెలుగుదేశం పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ. నిజానికి పట్టాభిపై తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం గుర్రుగా ఉంటుంది. పట్టాభి బాడీ లాంగ్వేజీ, ఆసువుగా చేసే ఆరోపణలపై అనేక మంది సీనియర్ నేతలు అభ్యంతరం చెబుతూ వచ్చారు.

పట్టాభిని సమర్థించి….

కానీ చంద్రబాబు వీరిని పట్టించుకోలేదు. ఉన్న ఒక్క వాయిస్ ను ఆపేస్తే ఎలా? అని పట్టాభిని చంద్రబాబు సమర్థించుకుంటూ వచ్చారు. మొన్నా మధ్య కాకినాడ వెళ్లి పట్టాభి అక్కడి స్థానిక ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడం, వెనువెంటనే మత్స్యకారులు ఆందోళనలకు దిగడంతో పట్టాభిపై కొందరు తూర్పుగోదావరి జిల్లా నేతలు ఫిర్యాదు చేశారు కూడా. పట్టాభి ఒకరోజు రాజమండ్రి జైలులో ఉంటే ఆ నేతలు ఎవరూ అటువైపు చూడలేదు.

సీనియర్ నేతల సూచనతో….

ఇక పట్టాభి ముఖ్యమంత్రి జగన్ అన్నారా? లేదా సజ్జల రామకృష్ణారెడ్డిని అన్నారా? అన్నది పక్కన పెడితే తాము దేవాలయంగా భావించే పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని ఆ పదాన్ని ప్రయోగించడం తప్పు అని ఇప్పటికే కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. పట్టాభి ఇలా మాట్లాడుతూ పోతే జగన్ కే సానుభూతి వస్తుందని కూడా సీనియర్ నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని దానిని పట్టాభి వంటి వారి వల్ల పోగొట్టుకోకూడదని చెప్పినట్లే సమాచారం.

బాబే స్వయంగా….

దీంతో చంద్రబాబు స్వయంగా పట్టాభిని కొన్నాళ్లు ఊళ్లు తిరిగి రావాల్సిందిగా పంపించారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పట్టాభి ఉంటే టెన్షన్ అనవసరంగా పెరుగుతుందని, దాని కంటే కొన్నాళ్లు అతను మౌనంగా ఉంటే మంచిదని చంద్రబాబు కూడా అభిప్రాయపడుతున్నారు. పట్టాభి అన్నది తప్పేనని తెలిసినా దానిని తప్పు అని చెప్పడానికి చంద్రబాబుకు అహం అడ్డొస్తొంది. అందుకే చంద్రబాబు పట్టాభిని కంట్రోల్ చేయాలని నిర్ణయించారు. ఆయన హర్ట్ కాకుండా ఉండేందుకు దారి ఖర్చులన్నీ ఇచ్చి చంద్రబాబే మాల్దీవులకు పంపారన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.

Tags:    

Similar News