జనసేనలో ‘‘మెగా’’ ఆఫర్ లేనట్లేనా ...!!

Update: 2018-12-31 13:30 GMT

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీలోని చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశ పడుతున్నారు. జనసేనకు ఎవరూ లేని రోజుల నుంచి కూడా పార్టీని వారే కాపు కాస్తున్నారు గతంలో ప్రజారాజ్యంలోనూ కీలకంగా వ్యవహరించిన వారు ఇపుడు తమ్ముడు పార్టీలోనూ చురుకుగా ఉన్నారు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో వారు పోటీకి రెడీ అంటున్నారు. విశాఖ జిల్లాలో చూసుకుంటే కనీసం అరడజను మంది అభిమాన నాయకులు అలా ఉన్నారు. వారికి టికెట్లు వస్తాయా రావా అన్నది ఇపుడు చర్చగా ఉంది.

విశాఖ తూర్పు నుంచి ...

విశాఖ అర్బన్ జిల్లాలో తూర్పు నియోజకవర్గం ఉంది. ఇక్కడ నుంచి పోటీకి మెగాభిమాని రాఘవరావు పోటీకి సంకేతాలు ఇస్తున్నారు. ఈ మధ్యన ఆయన పేరిట ఫ్లెక్సీలు అంతటా ఏర్పాటు చేసి మరీ తానున్నానని గట్టిగానే చాటుకుంటున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఆయన పోటీ చేసేందుకు జనసేనాని ఏమంటారో మరి. ఇక్కడ చూస్తే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యెగా రెండు దఫాలుగా గెలుస్తూ వస్తున్న వెలగపూడి రామక్రిష్ణబాబు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే టికెట్ అని అనుకుంటున్నారు. గతసారి 45 వేల పైచిలుకు మెజారిటీ తెచ్చుకున్న వెలగపూడి గట్టి అభ్యర్ధి అనడంలో సందేహం లేదు. ఇక వైసీపీ నుంచి చూసుకుంటే వంశీక్రిష్ణ రంగంలో ఉన్నారు. ఆయన సైతం సామజిక సమీకరణలతో పాటు, అర్ధ బలం దండీగా ఉన్నవారే. ఈ ఇద్దరి మధ్యలో పోటీ ఓ రేంజిలో సాగుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి. ఇక్కడ జనసేనలో కొత్త వారికి అవకాశం ఉంటుందా అన్నది చూడాలి.

బలమైన వారి కోసమేనా...?

ఇక్కడ జనసేన కూడా బలమైన వారి కోసం వెతుకుతున్నట్లుగా చెబుతున్నారు. ఆ పార్టీ దృష్టిలో మెగాభిమాని ఉన్నప్పటికీ ఆయన వీరిని ఢీ కొట్టగలరా అన్న సందేహంతోనే కొత్త వారి కోసం అన్వేషిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వచ్చిన టికెట్ ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. దాంతో మెగాభిమాని ఆశలు గల్లంతేనా అన్న మాట వినిపిస్తోంది. ఇదే విధంగా గాజువాక, పెందుర్తి, విశాఖ దక్షిణం, పశ్చిమంలోనూ మెగాభిమానులు పోటీకి సిధ్ధపడుతున్నా అధినాయకత్వం ఎంతవరకు సపోర్ట్ చెస్తుందన్నది ప్రశ్నార్ధకంగా ఉంది. మరి గతంలోనూ కేవలం పార్టీ సేవలకే ఉపయోగించుకున్నారని, ఇపుడు కూడా అవకాశం ఇవ్వకపోతే తాము పల్లకీ మోసే బోయీలుగానే ఉండిపోతామా అన్నా ఆవేదన వారిలో కల్గుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.

Similar News