వేలు పెట్టి తప్పు చేశామా....!!!

Update: 2018-12-10 12:30 GMT

అనుకున్నది ఒక్కటి...అయిన‌ది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్..బుల్ పిట్ట‌..అని సినీ క‌వి రాసిన పాట ఇప్పుడు చంద్రబాబు చూసిన వారెవ‌రికైనా గుర్తుకు రాక‌మాన‌దు.. ఎలాగైన తెలంగాణ‌లో ప‌రోక్షంగా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని చూసిన చంద్రబాబుకు ఎదురుదెబ్బే త‌గిలేట్లు ఉంది. రెండు క‌ళ్ల సిద్ధాంతంతో అక్కడా.. ఇక్కడా..అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని క‌న్నేసిన చంద్రబాబుకు ప‌రిస్థితి బాగోలేద‌ని అర్థమ‌వుతోంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇందులో ఇడియా టుడే సహ టౌమ్స్‌నౌ..జ‌న్‌కీ బాత్‌, రిప‌బ్లిక‌న్ టీవీ స‌హ ప‌లు సంస్థలు టీఆర్ ఎస్‌కు అనుకూలంగా స‌ర్వేల‌ను వెల్లడించాయి. ఇండియా టుడే అయితే 75 నుంచి 92 స్థానాల వ‌ర‌కు టీఆర్ ఎస్ గెలుచుకుంటుంద‌ని చెప్పింది. ఇక టౌమ్స్‌నౌ..జ‌న్‌క్ బాత్ స‌ర్వేలు 55 నుంచి 65వ‌ర‌కు టీఆర్ ఎస్ స్వాధీనం చేసుకుంటాయ‌ని తెలిపాయి. రిప‌బ్లిక‌న్ టీవీ మాత్రం 56కి మించక‌పోవ‌చ్చని పేర్కొంది.

లడపాటి సర్వే.....??

ఇక గ‌త ప‌ది రోజులుగా స‌ర్వే పేరుతో రాజ‌కీయాల‌ను హీట్ పుట్టించిన ల‌గ‌డ‌పాటి శుక్రవారం తెలిపిన వివ‌రాల ప్రకారం.. 25 నుంచి 35చోట్ల టీఆర్ఎస్ గెలుస్తుంద‌ని అంచ‌నా వేశారు. అయితే తాను చెప్పిన స‌ర్వేకు టీఆర్ఎస్‌కు 10 సీట్లు పెర‌గ‌వ‌చ్చు..లేదా త‌గ్గవ‌చ్చంటూ మెలిక పెట్టారు.ఇదిలా ఉండ‌గా ర‌చ్చ గెలిచి..ఇంట గెల‌వాల‌ని చూసిన చంద్రబాబుకు ఎగ్జిట్ ఫ‌లితాలు రుచిచ‌డం లేద‌ట‌. తెర‌వెనుక చక్రం తిప్పి మ‌హాకూట‌మిని ఏర్పాటు చేయ‌డంలో కీల‌కంగా వ్యవ‌హ‌రించిన అది గెలవకుంటే మాత్రం వైఫ‌ల్యం తాను చెందినట్లే భావ‌న‌తో ఉన్నార‌ని తెలుస్తోంది. తెలంగాణ‌లో అధికారాన్నిసాధించాల‌నుకున్న క‌ల‌లు...క‌ల్లలుగా మారాయ‌ని నైరాశ్యం చెందుతున్నారంట‌.

ఒరిగిందేమీ లేకున్నా.....

ఇక కాంగ్రెస్‌తో తెలంగాణ‌లో పెద్దగా ఒరింగిందేమీ లేక‌ప‌ోయిన‌ప్పటికీ ఆంధ్రాలో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో పొత్తు విష‌యాల‌ను అస్త్రంగా చేసుకుంటే కొంత ఇబ్బంది త‌ప్పదు. రాష్ట్రాన్ని విడ‌దీసిన పార్టీయే గాక‌..36 సంవ‌త్సరాలుగా వైరంతో ఉన్న పార్టీతో జ‌త క‌ట్టడంపై ఇప్పటికే ఇంటా..బ‌య‌ట విమ‌ర్శల‌తో బాబు త‌డిసి ముద్దవుతున్నారు. ప్రజాక్షేత్రంలోనూ ప‌రిస్థితి అనుకూలంగా ఏమి లేదు. వైసీపీ అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ జ‌న‌క్షేత్రంలో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడ‌గ‌ట్టుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప‌రిస్థితి ఏటికి ఎదురిదీన‌ట్లు ఉంది.

టార్గెట్ గా మారి....

ఇక తెలంగాణ‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రిగా పోటీ చేసి 15 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 13 సీట్లోలో పోటీ చేసింది. అందులోనూ మ‌క్తల్‌, ఇబ్రహీంప‌ట్నంలో రెబ‌ల్స్ ఉన్నారు. మ‌ల‌క్‌పేట ఎలాగూ ఎంఐంఎం గెలిచే సీటే. మిగిలిన 10 సీట్లలోనూ ఆ పార్టీ మ‌హాఅయితే 6-7 సీట్ల‌కు మించి గెలిచే ప‌రిస్థితి లేదు. ఇక ఇక్కడ రిజ‌ల్ట్ టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ‌స్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ రాజ‌కీయాల్లోకి టీఆర్ఎస్ నేరుగా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోన‌వ‌స‌రం లేదు. ఇప్పటికే కేటీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో వేలుపెట్టి చంద్రబాబు అంతు తేలుస్తామ‌ని స‌వాల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా తెలంగాణ రాజ‌కీయాల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టి ఇటు టీఆర్ఎస్‌తో పాటు అటు మోడీకి మ‌రింత టార్గెట్‌గా మారాడు.

Similar News