ఆమె మనసు మారింది..!!

Update: 2018-12-15 12:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర శ్రికాకుళాం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎక్కడ చూసిన ప్రజలౌ బ్రహ్మరధం పడుతున్నారు. అయితే ఈ జిల్లాలో భారీగా చేరికలు ఉంటాయని భావించిన వైసీపీకి అంతగా ఆశావహ వాతావరణం కనిపించడంలేదు. జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరుతారని ఆ మధ్య ప్రచారం జరిగినా ఇపుడు ఆమె మనసు మార్చుకున్నారని అంటున్నారు. ఏపీలోనే కాకుండా దేశంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో కృపారాణి కాంగ్రెస్ లోనే కొనసాగుతారని అంటున్నారు.

టెక్కలి సీటు కోసం......

ఆ మధ్య కాలంలో ఆమె వైసీపీలోకి చేరాలనుకున్నారు. అందుకోసం వైసీపీ నేతలతో రాయబేరాలు కూడా నడిపారని ప్రచారం జరిగింది. టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీకి ఆమె కోరుకుంటున్నారని అది కనుక ఇస్తే వైసీపీలో చేరేందుకు అభ్యంతరం లేదని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే జగన్ మాత్రం శ్రీకాకుళం పార్లమెంట్ సీటుకు ఆమెను పోటీ చేయమని కోరినట్లుగా తెలిసింది. ఆమె కనుక ఒప్పుకుంటే బలమైన అభ్యర్ధి అవుతారని కూడా వైసీపీ అధినాయకత్వం భావించింది. కానీ కృపారాణి మనసు మాత్రం టెక్కలి మీదనే ఉంది. దాంతో ఆమె సందిగ్దంలోనే ఉండిపోయారు. ఈ లోగా టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదనలు రావడం, దేశంలో కూడా కాంగ్రెస్ పరిస్థితి మెరుగు కావడం వంటి పరిణామాల నేపధ్యంలో క్రుపారాణి హస్తం పార్టీలోనే ఉండాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి కేంద్రంలో అధికారం చేపట్టినా మేలు కలుగుతుందన్న ఆలోచనలో కూడా మాజీ కేంద్ర మంత్రి అనుచరులు ఉన్నట్లుగా అంటున్నారు.

వైసీపీలో పోరు....

ఇక టెక్కలి వైసీపీలో వర్గ పోరు జోరుగా ఉంది. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటె చేసిన దువ్వాడ శ్రీనివాస్ ని తప్పించి పేరాడ తిలక్ కి ఇంచార్జి బాధ్యతలు జగన్ అప్పగించారు. దాంతో రెండు వర్గాలుగా టెక్కలి వైసీపీ చీలిపోయింది. ఈ తగాదాలతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. పార్టీ కూడా పడకేసిందని అంటున్నారు. మరో వైపు సాక్షాత్తు నోరున్న మంత్రి కింజారపు అచ్చెమ్నాయుడు టెక్కలి ఎమ్మెల్యెగా ఉంటున్నారు. ఆయనతో పాటు పార్టీ కూడా ఇక్కడ బలంగా ఉంది. ఈ నేపధ్యంలో లో వైసీపీలో గ్రూపులు ఆపకపోతే మంత్రిని ఓడించడం ఈ దఫా కూడా సాధ్యం కాదని అంటున్నారు. మధ్యేమార్గంగా జగన్ క్రుపారాణికైనా టికెట్ ఇస్తే బాగుండేదన్న మాట కూడా వినిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందువల్ల మార్పులు ఏమైనా జరుగుతాయేమో చూడాలి.

Similar News