తలబిరుసుతోనే ఈ తిప్పలా...?

Update: 2018-12-27 12:30 GMT

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న కర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తికి ఇప్పుడు రాజ‌కీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నా యి. త‌న వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల‌తో తీవ్ర‌స్థాయిలో వివాదాల‌కు కార‌ణ‌మైన క‌ర‌ణం బ‌ల‌రాంకి సొంత పార్టీలోనే శ‌త్రువులు ఎక్కువఅయ్యారు. ఇది ఆయ‌న స్వ‌యంకృతం. ఎవ‌రినీ క‌లుపుకొనివెళ్ల‌కుండా త‌న‌కంటూ. ప్ర‌త్యేక వ‌ర్గాన్నిఏర్పాటు చేసుకుని.. త‌ల‌బిరుసు రాజ‌కీయాలు చేసిన ఫ‌లితంగా ఇప్పుడు ఆయ‌న ఏటికి ఎదురీదాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ప్ర‌కాశం జిల్లాఅద్దంకి నియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్పుడు క‌ర‌ణానికి కొట్టిన పిండి. అయితే, ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోకుండా, త‌న వ్య‌క్తిగ‌త ఆధిప‌త్యానికి ఆయ‌న తెర‌దీశారు. ఫ‌లితంగా ఆయ‌న‌ను ప్ర‌జ‌లు దూరం పెట్టారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో క‌ర‌ణం గ్రాఫ్ చాలా డౌన్ అయ్యింద‌న్న‌ది మాత్రం వాస్త‌వం.

బాబు ప్రాధాన్యత ఇచ్చినా.....

ఇక‌, పార్టీలో సీనియ‌ర్ అయిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు క‌ర‌ణం బ‌ల‌రాంకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌కు అద్దంకి టికెట్‌ను సైతం కేటాయించారు కానీ, బ‌ల‌రాం త‌న కుమారుడిని గెలిపించుకోలేక పోయారు. ఆ త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో చంద్ర‌బాబు.. ఇక్క‌డ నుంచి వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధించిన యువ కిశోరం గొట్ట‌పాటి ర‌విని పార్టీలోకి తీసుకువ‌చ్చారు. అయితే, ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర విభేదాలు ఉన్న నేప‌థ్యంలో గొట్టిపాటిరాక‌ను బ‌ల‌రాం తీవ్ర స్థాయిలో విభేదించారు. చంద్ర‌బాబు ఎన్నిసార్లు స‌యోధ్య చ‌సినా కూడా బ‌ల‌రాం త‌న వ్య‌వ‌హార శైలిని మార్చుకోలేదు. దీంతో గొట్టిపాటి వ‌ర్సెస్ బ‌ల‌రాం ల మ‌ధ్య విభేదాలు అలానే న‌డుస్తున్నాయి

ఇంకో నియోజకవర్గం.....

ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు మాసాలే గ‌డువు ఉన్న నేప‌థ్యంలో బ‌ల‌రాం మ‌రింత దూకుడు పెంచారు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ అద్దంకి టికెట్‌ను త‌న కుమారుడికి ఇవ్వాల‌ని, తాను గెలిపించుకుంటాన‌ని చెప్పుకొస్తున్నారు. అయితే, క్షేత్ర‌స్థాయిలో ఈ విష‌యంపై స‌ర్వే చేయించిన చంద్ర‌బాబు.. గొట్టిపాటి ర‌వి హ‌వా ముందు క‌ర‌ణం కొట్టుకుపోతున్నార‌ని గ్ర‌హించి.. అద్దంకి టికెట్‌ను గొట్టిపాటికే ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కావాలంటే .. మ‌రేదైనా నియోజ‌క‌వ‌ర్గం ప‌రిశీలిస్తామ‌ని చెప్ప‌డంతో బ‌ల‌రాం ఇక‌, త‌న దారి తాను చూసుకునేందుకు రెడీ అయిన‌ట్టే తెలుస్తోంది. అద్దంకిని వ‌దిలి మ‌రో నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు క‌ర‌ణం ఫ్యామిలీ ఏమాత్రం ఆస‌క్తితో లేదు. ఈ క్ర‌మంలోనే ముందుత‌న కుమారుడు వెంకటేష్‌ను వైసీపీలోకి చేర్చే విష‌యంపై బ‌ల‌రాం.. పావులు క‌దిపిన‌ట్టు టాక్‌.

జగన్ ఛాన్స్ ఇస్తారా....?

వాస్త‌వానికి గొట్టిపాటి ఎలాగూ వైసీపీ నుంచి వెళ్లిపోయాడు క‌నుక‌.. క‌ర‌ణానికి త‌మ పార్టీలో ఛాన్స్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఎప్ప‌టి నుంచో భావిస్తున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌ర‌ణం ఇక వైసీపీ బాట‌! అనే వార్త‌లు కూడా హ‌ల్‌చ‌ల్ చేశా యి. అయితే, వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు క‌ర‌ణం కొట్టిపారేస్తున్నా.. తాజాగాఇక‌, టీడీపీ టికెట్ ద‌క్క‌ద‌ని తెలిసిన త‌ర్వాత ఇక‌, తాను టీడీపీలో ఉండి ప్ర‌యోజ‌నం ఏంట‌ని ఆయ‌న భావిస్తున్నారు. నిజానికి ఒక్క‌టికెట్ విష‌య‌మే కాదు.. ఇత‌ర విష‌యాల్లోనూ క‌ర‌ణంను స్థానిక టీడీపీ నాయ‌కులు విభేదిస్తున్నారు ఆయ‌న ఒంటెత్తు పోక‌డ‌ల‌ను స‌హించ‌లేక పోతు న్నామంటూ.. అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో ఇప్పుడు క‌ర‌ణంను వ‌దిలించుకోవ‌డమే బెస్ట్ అని టీడీపీ భావిస్తోంది. దీనిపై త్వ‌ర‌లో నే క్లారిటీ రానుంది.

Similar News