జ‌గ‌న్‌కు ఈసారి వాళ్లు ఫ్యాన్స్ అవుతున్నారా..!

Update: 2018-06-08 01:30 GMT

జ‌గ‌న్ ఆప‌రేష‌న్ స‌క్సెస్‌... అవుతుందా? ఎస్ ఇది నూటికి నూరుపాళ్లు నిజం అనే చెప్పాలి. టీడీపీకి ప్రధాన సామాజిక వర్గానికి అవినాభావ సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సామాజిక వర్గం మొత్తం టీడీపీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీకే ఎక్కువుగా స‌పోర్ట్ చేస్తోంది. ఏపీ రాజ‌ధాని ప్రాంతం అయిన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వీరి ప్ర‌భావం ఎక్కువ‌. ప్ర‌కాశంతో పాటు ప‌శ్చిమ‌గోదావ‌రిలోనూ ఈ వ‌ర్గం ఎమ్మెల్యేలు ఎక్కువ‌గానే చ‌ట్ట‌స‌భ‌ల‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

గత ఎన్నికల్లో పక్కన పెట్టినా..?

ఇక టీడీపీ స్థాపించిన ఎన్టీఆర్ అదే సామాజిక వర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో స‌హ‌జంగానే ఈ కులంలో ఎక్కువ మంది స‌పోర్ట‌ర్లు టీడీపీకే మ‌ద్ద‌తు ఇస్తూ వ‌చ్చారు. అయితే ప్రస్తుతం ఏపీలో పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం చూస్తుంటే ఈ సామాజిక వ‌ర్గంలో చీలిక వ‌చ్చింద‌న్న విష‌యం స్ప‌ష్టం అవుతోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ వ‌ర్గాన్ని ప‌క్క‌న పెట్టారు. కృష్ణా జిల్లాలో వీళ్ల‌కు ఏ రాజ‌కీయ పార్టీ అయినా ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తూ ఉంటుంది.జ‌గ‌న్ మాత్రం గ‌త ఎన్నిక‌ల్లో గుడివాడ‌లో కొడాలి నాని ఒక్క‌డికి మాత్ర‌మే సీటు ఇచ్చారు. ఈ సామాజిక వర్గానికి ఇచ్చే గుంటూరు ఎంపీ సీటును కాపుల‌కు ఇచ్చారు. విజ‌య‌వాడ ఎంపీ సీటు కూడా ఈ వ‌ర్గానికే ఇచ్చినా తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఉన్న కోనేరు ప్ర‌సాద్‌కు ఇచ్చారు. ప్ర‌సాద్ చిత్తుగా ఓడిపోగా...గుడివాడ‌లో మాత్రం నాని పార్టీ, జ‌గ‌న్‌తో సంబంధం లేకుండా వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తో మూడో సారి గెలుపు సాధించారు. ఈ సారి మాత్రం ఇక్క‌డ ఈ వ‌ర్గానికి ప్ర‌యారిటీ ఇవ్వాల్సిందే అని గ‌ట్టిగా డిసైడ్ అయిన జ‌గ‌న్ ఈ వ‌ర్గంలో ప‌లువురు ప్ర‌ముఖుల‌ను త‌న వైపున‌కు తిప్పుకునే ఆప‌రేష‌న్ స్టార్ట్ చేసి స‌క్సెస్ అయ్యారు.

ఇప్పటికే సీట్లు రిజర్వు చేసిన జగన్....

గుంటూరు జిల్లాలో గుంటూరు ఎంపీ సీటును ఈ వ‌ర్గానికి చెందిన విజ్ఞాన్ విద్యాసంస్థ‌ల అధినేత లావు శ్రీకృష్ణ దేవ‌రాయులుకు ఇచ్చారు. ఇక ఈ జిల్లాలో తెనాలి- పొన్నూరు-చిల‌క‌లూరిపేట‌-వినుకొండ ఈ నాలుగు అసెంబ్లీ సీట్ల‌తో పాటు మ‌రోసీటు కూడా ఇచ్చే అంశంపై ఆలోచ‌న చేస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలో విజ‌య‌వాడ ఎంపీ సీటుతో పాటు ఇప్ప‌టికే గ‌న్న‌వ‌రం - గుడివాడ - మైల‌వ‌రం - విజ‌య‌వాడ తూర్పు సీట్లు జ‌గ‌న్ ఈ వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేసేశారు. గుడివాడ‌లో ఎలాగూ మ‌ళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని పోటీలో ఉంటారు. విజ‌య‌వాడ ఎంపీగా ఈ వ‌ర్గంలో ఆర్థికంగా బ‌ల‌మైన వ్య‌క్తుల కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. ఇక గన్న‌వ‌రంలో యార్ల‌గ‌డ్డ వెంకట్రావు, విజ‌య‌వాడ‌లో య‌ల‌మంచిలి ర‌వి, మైల‌వ‌రంలో వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ పోటీ చేస్తున్నారు. వీరితో పాటు పెన‌మ‌లూరు సీటును కూడా ఇస్తే ఎలా ఉంటుంద‌ని జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సామాజిక వర్గం బ‌లంగా ఉంది.

ఆ సామాజిక వర్గాన్ని ఆకర్షిస్తూ...

ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోనూ దెందులూరు లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కొఠారు అబ్బ‌య్య చౌద‌రి లాంటి వాళ్లు వైసీపీ నుంచి పోటీకి దిగుతున్నారు. దీంతో పాటు ఆర్థికంగా బ‌ల‌మైన ఆ సామాజిక వ‌ర్గం నేత‌ల‌తో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ వెంటే ఉన్న సినిమా ఇండ‌స్ట్రీ వాళ్లు కూడా ఈ కులంలో ఇప్పుడు కొంత‌మంది ధైర్యంగా జ‌గ‌న్ వైపు అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా జ‌గ‌న్ ఒక బలమైన సామాజిక వ‌ర్గాన్ని ఎట్రాక్ట్ చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నం సూప‌ర్ స‌క్సెస్ అయ్యింద‌న్న టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

Similar News