జగన్ ఆ కండిషన్ పెడితే బాబుకు ఇత్తడే మరి ?

రోజులు జగన్ వి. ఒకపుడు చంద్రబాబు దర్జా అంతా ఇపుడు జగన్ సొంతం అయింది. ఢిల్లీ వెళ్తే జగన్ కి రెడ్ కార్పెట్ పరచేందుకు మోడీ సర్కార్ [more]

Update: 2020-10-05 09:03 GMT

రోజులు జగన్ వి. ఒకపుడు చంద్రబాబు దర్జా అంతా ఇపుడు జగన్ సొంతం అయింది. ఢిల్లీ వెళ్తే జగన్ కి రెడ్ కార్పెట్ పరచేందుకు మోడీ సర్కార్ సిద్ధంగా ఉంది. దానికి కారణం ఆయన వెనక ఉన్న ఎంపీల బలం. ఇక ఏపీలో కూడా జగన్ సంక్షేమ రాజ్యానికి అచ్చమైన చిరునామాగా ఉన్నారు. నీ మీద మోజు పోలేదురా జగన్మోహనా అంటున్నారు ఏపీ జనం. విప‌ టీడీపీ కళ్ళ జోడు నుంచి చూస్తూ అనుకూల మీడియా మెదడుతో ఆలోచన చేసేవారికి జగన్ పాపులారిటీ పడిపోయిందనిపించవచ్చు కానీ ఢిల్లీని ఏలే పెద్దలకు మాత్రం జగన్ ఇమేజ్ ఏంటో చాలా బాగా అవగాహన ఉందంటున్నారు.

నమ్మకమే అలా :

సౌత్ లో తిప్పి తిప్పి చూసినా ఒక్క కర్ణాటక తప్ప ఎక్కడా బీజేపీ ఎదగలేదు. రేపటి రోజున ఎన్నికలు పెడితే కర్ణాటకలో సీన్ కాలుతుందో ఏమో ఎవరికీ తెలియదు. తెలంగాణాలో దూకుడుగా బీజేపీ ఉన్నా అధికారంలోకి రావడం మాత్రం ఆమడదూరమేనని బీజేపీ పెద్దలకు కూడా తెలుసంటున్నారు. తమిళ సీమలో కాళ్ళూనే పరిస్థితి ఎప్పటికీ  లేదు. ఏపీలో సైతం ఇంకా దారుణంగా బీజేపీ ఉంది. దాంతో తమకు నమ్మకమైన నేస్తం సౌత్ లో బీజేపీకి అర్జంటుగా కావాలి.

ముందు చూపుతోనే అలా :

బీజేపీకి ఓ వైపు  బీపీ పెరుగుతోంది. ఇపుడు అధికారంలో ఉన్నాం, కానీ మళ్ళీ ఎన్నికలకు వెళ్తే సీన్ సితారేనని కూడా బాగా తెలుసు. బీజేపీ  తన మొత్తం పొలిటికల్ కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాఫ్ నే సాధించేసింది. 303 సీట్లు సొంతంగా అంటే చిన్నమాట కాదు, ఉత్తరాది అంతా ఊడ్చేస్తే వచ్చిన మెజారిటీ అది, దానికి ఈశాన్యం, కొన్ని పశ్చిమ ప్రాంతాలు కూడా ఊతమిచ్చాయి. సౌత్ మాత్రం యధాప్రకారం హ్యాండ్ ఇచ్చేసింది. ఇపుడు 2024 వరకూ చూసుకుంటే ఉత్తరం సగం వాడిపోయేలా ఉంది. సౌత్ లో సత్తా చాటే చాన్స్ అంతకంటే లేదు. అందుకే జగన్ కోసం మోడీ, అమిత్ షా ద్వయం అరాటపడుతున్నారు అంటున్నారు. వారి లెక్కల్లో 2024లోనూ జగన్ గెలిచి తీరుతాడు. ఒకటి రెండు తగ్గినా మెజారిటీ ఎంపీ సీట్లు ఆయనకే ఉంటాయి. అందుకే జగన్ తో చెలిమికి రెడీ అంటున్నారుట.

అది ఒప్పుకుంటేనే :

ఇక జగన్ వరకూ తీసుకుంటే బీజేపీతో అర్జంటుగా జట్టు కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఆయన మీద కేసులు ఉన్నాయి అని భయపడేంత సీన్ కూడా లేదు. అవి ఎపుడో పెట్టిన కేసులు. ఇక కొత్తగా ఆయనకు జైలూ బెయిలూ భయం అంతకంటే లేదు. కానీ రాజకీయ కారణాలే జగన్ బీజేపీ కలిసేలా చేస్తాయని అంటున్నారు. తనను జైలు గోడల మధ్యన ఇరికించి యవ్వన ప్రాయంలో విలువైన కాలాన్ని హరించిన చంద్రబాబు మీదనే జగన్ కి పెద్ద లెక్క ఉందని అంటున్నారు. తాను ఎన్డీయేలో చేరాలంటే బాబు మీద సీబీఐ కేసులు పడాల్సిందే. ఇదే కండిషన్ మీద అయితే జగన్ కలిసే చాన్స్ ఉంది. ఏపీలో టీడీపీని నామరూపాలు లేకుండా చేయలంటే ముందు టీడీపీ పెద్దాయన లెక్కలు తేల్చాల్సిందేనని జగన్ థియరీగా ఉందంటున్నారు. దీనికి బీజేపీ ఎస్ అంటే చాలు ఎన్డీయేలో వైసీపీ చేరుతుంది. ఏపీలో బాబు జాతకం కూడా మారుతుంది అంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News