సీన్ రివర్స్ ఇలా ఎందుకయిందంటే....??

Update: 2018-12-15 08:00 GMT

ప్రజాదరణ ఉన్నా ఎలా ఓడిపోయాం..? ఇదే కాంగ్రెస్ పార్టీని ఈనెల 11 తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక నిద్రలేకుండా చేస్తున్న అంశం. పోనీ కాంగ్రెస్ పార్టీకి గాలి లేదా అనుకుంటే రాజస్థాన్, చత్తిస్ ఘడ్, మధ్యప్రదేశ్ లలో అధికార బిజెపిని ఖంగు తినిపించి మరీ సింహాసనాలు దక్కించుకున్నారు అక్కడి పార్టీ సీనియర్లు. అదే తెలంగాణకు వచ్చేటప్పటికి సీన్ రివర్స్ అయ్యింది. అలా ఎలా జరిగిపోయింది. తప్పులెక్కడ వున్నాయి. ఎవరు ఏమి చేశారు ఇవన్నీ విచారణ చేస్తుంది హస్తం పార్టీ.

నాలుగు రకాలుగా ...

కాంగ్రెస్ పార్టీ తన పరాభవాన్ని ఇప్పట్లో అంగీకరించే పరిస్థితి లేదు. ఇప్పటికి ఒడిన పార్టీ సీనియర్లు షాక్ లోనే వున్నారు. ఇంతటి దారుణ పరాభావాన్ని వారు జీర్ణించుకోలేక కిందా మీదా పడుతున్నారు. ఇప్పటికే నలుగురు సభ్యులతో కాంగ్రెస్ ఓటమిపై విచారణ కమిటీని ఏర్పాటు చేసింది హస్తం పార్టీ. దీంతో పాటు ఈవీఎం లు ట్యాపరింగ్ చేశారంటూ ఈసీకి ఫిర్యాదు చేయడం తో పాటు న్యాయపోరాటానికి సిద్ధమైంది.

న్యాయపోరాటం....

ఇవన్నీ కాకుండా పార్లమెంట్ వేదికగా తెలంగాణ ఎన్నికల్లో అన్యాయం జరిగిందంటూ ఆవేదన, ఆక్రందన వినిపించనుంది. ఒక పక్క అవన్నీ జరుగుతుండగానే ఈవీఎం లు విధానం ద్వారా ఓటు వేసే ప్రక్రియ తీసేయాలని డిమాండ్ చేస్తూ, పాత బ్యాలెట్ పత్రంతో ఓటరు ఓటు వేసే విధానం తీసుకురావాలని కోరుతుంది. మొత్తానికి ఇన్నిరకాల పోరాటాల్లో తెలంగాణ కాంగ్రెస్ కి ఏమేరకు కలిసొస్తుందో చూడాలి మరి

Similar News