ఎన్నాళ్లకెన్నాళ్లకు….?

అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో భారత సంతతి మహిళకు ఎన్నడూ లేని గౌరవం లభించింది. భారత మూలాలున్న కమలా హారిస్ కు ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరుపున ఉపాధ్యక్ష [more]

Update: 2020-08-14 16:30 GMT

అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో భారత సంతతి మహిళకు ఎన్నడూ లేని గౌరవం లభించింది. భారత మూలాలున్న కమలా హారిస్ కు ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరుపున ఉపాధ్యక్ష పదవి వరించింది. ఈ విషయాన్ని డెమొక్రాట్ అధ్యక్ష్య అభ్యర్థి జో బైడెన్ ప్రకటంచారు. కమలా హారిస్ ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరుపున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడ్డారు. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తొలి దశలోనే బరి నుంచి తప్పుకున్నారు. అయితే ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ ను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.

డెమొక్రాట్ల తరుపున…..

అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు వచ్చే నవంబరు నెలలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తన ఓటమి తప్పదని డొనాల్డ్ ట్రంప్ ముందుగానే అంగీకరించారు. అనేక సర్వేలు సయితం జోబైడెన్ కు అనుకూలంగా ఫలితాలు ప్రకటించాయి. ట్రంప్ అమెరికా నినాదంతో ముందుకు వెళుతున్నారు. అయితే నల్లజాతీయులను ఆకర్షించేందుకు జోబైడెన్ కమలా హారిస్ పేరును ప్రకటించడంతో ఆయనకు పరిస్థితి మరింత అనుకూలంగా మారిందంటున్నారు.

వలస వచ్చిన వారే…..

కమలా హారిస్ తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చి స్థిరపడిన వారే. కమలా హారిస్ తండ్రి డొనాల్డ్ హారిస్ జమైకాకు చెందిన వారు. తల్లి శ్యామలా గోపాలన్ భారత్ లోని తమిళనాడుకు చెందిన వారు. ఇద్దరూ అమెరికాలో స్థిరపడి పౌరహక్కులపై పోరాటం చేయడంలో ఒక్కటయ్యారు. ఇటు జమైకా, అటు భారత్ మూలాలున్న కమలా హారిస్ ఎన్నికల బరిలో దిగడంతో ఇటు నల్లజాతీయుల ఓట్లు, అటు భారతీయ ఓట్లు డెమొక్రాట్ల పరమవుతాయన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

ట్రంప్ కు చెక్….

కమలా హారిస్ పేరు ప్రకటన వెలువడగానే మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా సయితం ఆహ్వానించారు. కమలా హారిస్ బరిలోకి దిగడంతో ట్రంప్ ఓటమి ఖాయమైనట్లేనన్న కామెంట్స్ గట్టిగా వినపడుతున్నాయి. కాలిఫోర్నియా నుంచి కమలా హారిస్ సెనేటర్ గా ఉన్నారు. అమెరికా చరిత్రలో ఒక మహిళ ఉపాధ్యక్షురాలిగా పనిచేయలేదు. ట్రంప్ నిర్ణయాలతో విసిగిపోయిన భారతీయ అమెరికన్లు సయితం కమలా హారిస్ ఎంపికతో డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపే అవకాశముందన్నది విశ్లేషకుల అంచనా. మొత్తం మీద అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో భారత్ మూలాలున్న మహిళ బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాయటర్స్ వంటి సంస్థలు నిర్వహించిన ఆన్ లైైన్ సర్వేలోనూ కమలా హారిస్ కు 60 శాతం మంది అమెరికన్లు మద్దతు పలికారు. కమలా హారిస్ గెలుపు ఖాయమని చెప్పారు. జోబిడెన్ కు 44 శాతం, ట్రంప్ కు 37 శాతం మంది మద్దతు పలికారు.

Tags:    

Similar News