వాళ్ల చెంతన ఈటల చేరిపోతారా?

హుజూరాబాద్ ఎన్నికలు ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ ను నిర్ణయిస్తాయి. గతంలో ఎందరో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి రాజకీయంగా ఎటూ కాకుండా పోయారు. వారందరినీ ఇప్పుడు [more]

Update: 2021-09-07 09:30 GMT

హుజూరాబాద్ ఎన్నికలు ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ ను నిర్ణయిస్తాయి. గతంలో ఎందరో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి రాజకీయంగా ఎటూ కాకుండా పోయారు. వారందరినీ ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉండటంతో అన్నీ ఆయనకు అనుకూలంగా ఉన్నాయి.

గెలుపు మీద….

కానీ ఆరుసార్లు గెలిచిన ఈటల రాజేందర్ కు మాత్రం గెలుపు మీద డౌట్లు కొడుతున్నాయి. అధికార పార్టీ పెట్టిన ఖర్చు ఈటల రాజేందర్ చేయలేరు. వారికి సహకరించినట్లు అధికార యంత్రాంగం ఈటలకు సహకరించదు. వీటితో పాటు ఇప్పటికే ప్రధాన ఓటు బ్యాంకులన్నింటినీ దాదాపు అధికార పార్టీ తమ వైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఏ ఒక్క ఓటరును హుజూరాబాద్ లో వదిలిపెట్టకుండా టీఆర్ఎస్ ప్రయత్నిస్తుండటం ఈటల రాజేందర్ కు ఇబ్బందిగా మారింది.

బీజేపీలో చేరడం….

అందుకే ఆయన ఇప్పటికే 150 కోట్లు టీఆర్ఎస్ ఖర్చు చేసిందని చెబుతున్నారు. అంటే ఈటల రాజేందర్ చెప్పిన దానిని బట్టి టీఆర్ఎస్ అనధికారికంగా ఓట్లను ఇప్పటికే కొనుగోలు చేసిందనుకోవాల్సి ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడంతో తనకు కొంత ప్రయోజనం ఉంటుందని ఈటల రాజేందర్ భావించారు. కానీ బీజేపీ పట్ల ఆ నియోజకవర్గం ప్రజల్లో పెద్దగా సానుకూలత లభించడం లేదు.

ఆ లిస్టులోనే…?

ఇటు ఈటల రాజేందర్ కూడా ఆరుసార్లు గెలవడంతో ఆయనపై హుజూరాబాద్ ప్రజలకు మొహం మొత్తిందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ లో ఉద్యమం నుంచి ఉన్న నేతలు అనేక మంది కేసీఆర్ తో విభేదించి రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. హుజూరాబాద్ లో కనుక ఈటల రాజేందర్ ఓటమి పాలయితే ఈయన కూడా వారి జాబితాలో చేరడం ఖాయంగా కన్పిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News