నీవు నేర్పిన విద్యయే … నీరజాక్షా

దశాబ్దాల కాలం కేంద్రంలో అధికారాన్ని వెలగబెట్టిన కాంగ్రెస్ కి పార్టీ తనను ఎదిరించే వారికి శంకర గిరి మాన్యాలు పట్టించడం సంప్రదాయంగా పెట్టుకుంటూ వచ్చింది. గిట్టని వారిపై [more]

Update: 2019-02-07 04:06 GMT

దశాబ్దాల కాలం కేంద్రంలో అధికారాన్ని వెలగబెట్టిన కాంగ్రెస్ కి పార్టీ తనను ఎదిరించే వారికి శంకర గిరి మాన్యాలు పట్టించడం సంప్రదాయంగా పెట్టుకుంటూ వచ్చింది. గిట్టని వారిపై సిబిఐ కేసులు, మనీలాండరింగ్ ఆర్ధిక నేరాలు అనేకం బనాయించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించేది. ఫలితంగా చాలామంది జైహో కాంగ్రెస్ అనేలా చేయడం లేదా జైలుపాలు కావడం సరిపోయేది. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ కాంగ్రెస్ పాలన ఫాలో అవుతుండటంతో హస్తం పార్టీకి దిక్కుతోచడంలేదు. తమ పార్టీ లో కీ రోల్ లో ఉండేవారిని టార్గెట్ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను వారి ఆస్తులపై విచారణ జరిపించడంతో సోనియా రాహుల్ బృందంలో ఇప్పుడు గుబులు బయల్దేరింది.

సోనియా గాంధీ ముద్దుల అల్లుడు ప్రియాంకా గాంధీ భర్త ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. యుపిఎ హయాంలో అయాచిత లబ్ది పొంది మనీ లాండరింగ్ ద్వారా లండన్ లో ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులను ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కొనుగోలు చేసినట్లు ఆర్ధిక నేర పరిశోధన సంస్థ కేసు నమోదు చేసి విచారణ తీవ్రం చేసింది. ఈ కేసులో 42 ప్రశ్నలను సంధించి రాబర్ట్ ను ముప్పుతిప్పలు పెట్టింది ఈడీ. ఈ దెబ్బకు కోర్ట్ గుమ్మం ఎక్కినా వాద్రా ను ఈనెల 16 వరకు అరెస్ట్ చేయకుండా మాత్రం న్యాయస్థానం స్టే మంజూరు చేయడం కేసులో ప్రియాంక భర్తకు కొంత ఊరట. తమ క్లయింట్ ఎలాంటి నేరానికి పాల్పడలేదని వాద్రా న్యాయవాది వాదిస్తున్నారు. కేవలం రాజకీయ కక్ష తోనే ఆయనను వేధిస్తున్నారని రాబర్ట్ న్యాయవాది ఆరోపించడం విశేషం. తాము అనుసరించే వ్యూహాలనే కమలనాధులు అమల్లో పెట్టి అల్లడిస్తుండటంతో హస్తం పార్టీకి దిక్కుతోచని పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం రాబర్ట్ వాద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు నుంచి ఆయన ఎలా బయటపడతారో వేచి చూడాలి.

Tags:    

Similar News