సక్సెస్ పై సందేహాలు

చంద్రబాబుకు సీన్ మొత్తం అర్ధమైంది. ఇక అమరావతి అంటూ ఎంత గొంతు చించుకున్నా ఒరిగేది లేదని కూడా క్లారిటీ వచ్చింది. తాను చెప్పిన ప్రకారం గత యాభై [more]

Update: 2020-02-12 12:30 GMT

చంద్రబాబుకు సీన్ మొత్తం అర్ధమైంది. ఇక అమరావతి అంటూ ఎంత గొంతు చించుకున్నా ఒరిగేది లేదని కూడా క్లారిటీ వచ్చింది. తాను చెప్పిన ప్రకారం గత యాభై రోజులకు పైగా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్న రైతులను చంద్రబాబు హఠాత్తుగా వదిలేశారు. ఓ విధంగా చెప్పాలంటే కాడె కింద పడేశారు. ఇపుడు చంద్రబాబు తన రాజకీయ దారి తాను చూసుకుంటున్నారు. అమరావతి అంటూ ఉంటే మిగిలిన ప్రాంతాల్లో పట్టు జారుతోందని గ్రహించడం కూడా చంద్రబాబు వెనక్కితగ్గడానికి మరో కారణం అంటున్నారు.

ఇక యాత్రలే….

ఇప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయింది. ఈ మధ్యలో చంద్రబాబు ఎన్నో సార్లు జనంలోకి వచ్చారు. కానీ ఎక్కడా ఆయన సక్సెస్ ఫుల్ గా దాన్ని వాడుకోలేకపోయారు. జనం కూడా పెద్దగా చంద్రబాబు పర్యటనలు పట్టించుకోవడంలేదు. ఇపుడు బాబు గేర్ మార్చి మరో మారు బస్సు యాత్ర అంటున్నారు. అది పూర్తిగా రాజకీయం కోసమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఒడ్డున పడేయడానికి చంద్రబాబుకు ఈ యాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. జనంలోకి వెళ్ళి వైసీపీ వైఫల్యాలను గట్టిగా చెబుతారట.

ఆదరించేనా…?

బాబు గత ఎన్నికలలో ఓడిపోయాక ఇప్పటివరకూ మౌనంగా ఉండి ఇపుడు కొత్తగా జనంలోకి వస్తే ఆ ప్రభావం వేరేగా ఉండేదని సొంత పార్టీలోనే అంటున్నారు. చంద్రబాబు ఎన్నికలలోనూ, ఆ తరువాత ఫలితాలు రావడానికి మధ్య కాలంలోనూ, ఇక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా తగ్గలేదు. ప్రతీ రోజూ మీడియాలో ఫోకస్ గా ఉంటున్నారు. అధికార పార్టీని నానా తిట్లూ తిడుతున్నారు. అన్నింటికీ అడ్డుపుల్ల వేస్తున్నారు. ఈ మధ్యలో ఇసుక సత్యాగ్రహాలూ చేశారు, చలో ఆత్మకూరు లాంటివీ చేపట్టారు. దాంతో చంద్రబాబు కొత్తగా వచ్చేదీ, చెప్పేదీ ఏమీ ఉండడని జనం ఫిక్స్ అయిపోయారు. ఇక పార్టీ నేతలకూ ఆయన రొడ్డ కొట్టుడు ఉపన్యాసాలు బోరుగానే ఉంటున్నాయన్నది నిష్టుర సత్యం.

వ్యతిరేకత ఉంటే…?

అయితే చంద్రబాబు టూర్ ద్వారా వైసీపీకి కొంత మేలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీ సర్కార్ పాలన పట్ల జనంలో ఏ రకమైన అభిప్రాయం ఉందన్నది ప్రతిపక్ష నేత బస్సు యాత్ర ద్వారా తెలిసే అవకాశాలు ఉన్నాయి. జనంలో వ్యతిరేకత ఉంటే మాత్రం చంద్రబాబుకు ఆటోమెటిక్ గా స్పందన దానికదే వస్తుంది. లేకపోతే మాత్రం చప్పగా, నీరసంగానే చంద్రబాబు బస్సు యాత్రలు సాగుతాయని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు బస్సు యాత్ర వైసీపీకి ఒక చెక్ పాయింట్ గా ఉపయోగపడనుందని అంటున్నారు.

జీవన్మరణమేనా…?

ఇక లోకల్ బాడీ ఎన్నికలు చంద్రబాబుకు జీవన్మరణంగానే ఉన్నాయన్నది నిస్సందేహం. ఓ వైపు జగన్ దూకుడు, మరో వైపు పార్టీలో జారుతున్న పట్టు, రాజకీయంగా అంధకారం ఇవన్నీ కలిపి చూసుకున్నపుడు ఇప్పటికిపుడు టానిక్ గా పనికొచ్చేది విజయమే. అది స్థానిక ఎన్నికలు అయితే చంద్రబాబుకు చాలా బలం వస్తుంది. వైసీపీ మీద వ్యతిరేకత జనంలో ఉందని చెప్పుకుని మిగిలిన నాలుగేళ్ళూ ఏపీలో కలియతిరవచ్చు. అదే సమయంలో పార్టీలో తమ్ముళ్ళు కూడా కట్టడితో ఉంటారు. కానీ తేడా వస్తేనే చాప చుట్టేయాల్సివస్తుంది.

పెద్దగా వ్యతిరేకత లేకపోవడంతో…..

ఇదిలా ఉండగా జగన్ సర్కార్ సంక్షేమ పధకాలు జనంలో ఉన్నాయి. ఆయన అభివృధ్ధి సైతం పక్కన పెట్టి తన హామీలను తీర్చారు. దాంతో సానుకూలత ఉందనే అంటున్నారు. అదే సమయంలో బొత్తిగా ఏడాది కూడా కాలేదు కబట్టి అధికార పార్టీ మీద పెద్దగా వ్యతిరేకత పెరిగే చాన్స్ కూడా ఉండదన్నది మరో వాదన. ఇక అధికారంలో ఉన్న పార్టీకే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జనం కూడా అటే మొగ్గు చూపుతారు. ఇవన్నీ గమనంలోకి తీసుకున్నపుడు చంద్రబాబు చేపడతానంటున్న బస్సు యాత్ర ఫలితం తుస్సుమంటుందా అన్న డౌట్లు కూడా తమ్ముళ్ళలో పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News