బాబు పరువు మొత్తం పోయిందిగా?

చంద్రబాబునాయుడు రాజకీయ జీవితం అవకాశవాదమయం ఈ సంగతి అందరికీ తెలిసిందే. కానీ దాన్ని తెలుగుదేశం పార్టీ వారు రాజకీయ చాణక్యంగా చెప్పుకుంటారు. ప్రత్యర్ధులు నమ్మకద్రోహంగా ట్రీట్ చేస్తారు. [more]

Update: 2020-08-04 11:00 GMT

చంద్రబాబునాయుడు రాజకీయ జీవితం అవకాశవాదమయం ఈ సంగతి అందరికీ తెలిసిందే. కానీ దాన్ని తెలుగుదేశం పార్టీ వారు రాజకీయ చాణక్యంగా చెప్పుకుంటారు. ప్రత్యర్ధులు నమ్మకద్రోహంగా ట్రీట్ చేస్తారు. అయితే చంద్రబాబుని ఏపీలోనే ఇతర పార్టీల నేతలు విమర్శించడం ఇంతదాకా చూశాం. బాబుకు జాతీయ స్థాయిలో మాత్రం సీనియర్ లీడర్ గా పేరు ఉంది. ఆయన్ని పట్టుకుని హార్ష్ గా మాట్లాడిన నేత ఎవరూ లేరు ఇప్పటిదాకా. దాంతో చంద్రబాబు రాజకీయ ప్రాభవం జాతీయంగా ఎంతో కొంత వెలుగుతూ వస్తోంది. ఇపుడు ఆ వెలుగు కూడా ఆరిపోయింది. ఏకంగా పేరుపడిన జాతీయ మీడియాలోనే నేషనల్ కాన్ఫరెన్స్ కి చెందిన ఉపాధ్యక్షుడు, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బాబు మీద దారుణమైన కామెంట్స్ చేశారు.

నమ్మకద్రోహి అట…..

చంద్రబాబు కంటే విశ్వాసఘాతకుడు వేరే ఎవరూ ఉండరని ఒమర్ అబ్దుల్లా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు పరువుని పూర్తిగా తీశాయి. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని కూడా అనేశారు. ఆయన తన రాజకీయం కోసం అందరినీ ఉపయోగించుకుంటారని, ఆయన మాత్రం పచ్చి స్వార్ధపరుడని కూడా ఏకేశారు. 2019 ఎన్నికల్లో ఏపీలో బాబు ఓడిపోతాడని తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాకు తెలుసు అని కూడా బాంబు పేల్చారు. అయినా సరే మిత్ర ధర్మానికి కట్టుబడి తన సొంత ఎన్నికలను కూడా వదులుకుని వచ్చి ఫరూఖ్ ఏపీలో ప్రచారం చేశారని, మైనారిటీ ఓట్ల కోసం అలా చంద్రబాబు తమను వాడుకున్నారని కూడా దుమ్మెత్తిపోశారు. గత ఏడాది కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ని తొలగించి తన కుటుంబం మొత్తాన్ని గృహ నిర్బంధం చేస్తే చంద్రబాబు నుంచి ఒక్క సానుభూతి మాట రాలేదని నిప్పులే చెరిగారు.

ఆట కట్టేనా…?

ఏపీలో ఎంత దిగజారినా, ఎన్ని వెన్నుపోట్ల కధలు వినిపించినా వాటిని జాతీయ మీడియా దరికి చేరకుండా కాపాడుకుంటూ వస్తున్న చంద్రబాబు పరువుని ఓమర్ అబ్దుల్లా ఒక్క లెక్కన వీధుల్లో పడేశారు. బాబు నయవంచనను బట్ట విప్పి మరీ చెప్పారు. నిజానికి చంద్రబాబు ఆడుతున్న ఈ రాజకీయ నాటకాలు అన్నీ కూడా తెలియని వారు ఎవరూ జాతీయ స్థాయిలో లేరు. మమతాబెనర్జీ అయితే చంద్రబాబు గురించి తెలుసుకుని దూరంగా ఉంటున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు బాబు ఓటమి తరువాత హ్యాండ్ ఇవ్వడాన్ని చూసి రగిలిపోతున్నారు. ఇక శరద్ పవర్ లాంటి రాజకీయ దిగ్గజానికి బాబు మీద ఎపుడూ చిన్నచూపే ఉంది. అయినా వీరెవరూ మీడియా ముందుకు ఎక్కి బాబుని నిందించలేదు, అలా చేసి తాము తక్కువ కాదలచుకోలేదు అంటారు. దాంతో బాబు వ్యవహారం ఏదీ జాతీయ మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు. ఇపుడు బాబు బండారాన్ని ఒమర్ బయటపెట్టేశారు. ఇకపైన చంద్రబాబుకు జాతీయ మీడియాలో గౌరవం పాళ్ళు బాగా తగ్గిపోతాయనే అంటున్నారు.

దేబిరింపులూ…..

చంద్రబాబు రాజకీయ అవకాశవాదం ఎంతగా పరాకాష్టగా చేరిందంటే బీజేపీ వద్దంటున్నా, పొమ్మంటున్నా వన్ సైడ్ లవ్ అన్నట్లుగా ఇంకా ట్వీట్లు వేస్తూ మోడీ ఈజ్ గ్రేట్ అంటున్నారు. మోడీ నోట్లో మాట రావడమే ఆలస్యం సూపర్ అంటున్నారు. తాజాగా జాతీయ విద్యా విధానం అయినా మరోటి అయినా బాబు మోడీని పొగడ్తలతో ముంచేస్తున్నారు. కానీ చంద్రబాబు తెలుసుకోవాల్సింది ఒకటి ఉందని ఒమర్ అబ్దుల్లా లాంటి వారు అంటున్నారు. ఓడలు బళ్ళు అవుతాయి. ఎపుడూ మోడీయే అధికారంలో ఉండరు, ఇక 2024 ఎన్నికలు మోడీకి పెను సవాలే. అపుడు ఇటు వైపు రావాలనుకుంటే మాత్రం కుదరదనే ఒమర్ అబ్దుల్లాలాంటి వారు మాటల ద్వారా ఇస్తున్న వార్నింగులు అంటున్నారు. ఏది ఏమైనా ఇంట ఓడిన చాన్నాళ్ళకు బాబు రచ్చలోని చిత్తు అయ్యారని ప్రత్యర్ధి వైసీపీ సంబరపడుతోందిట.

Tags:    

Similar News