కత్తి మీద సామే.. ఎవరూ సంతృప్తిగా లేరట

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో సీట్ల పంపకం అధికార అన్నాడీఎంకేలో తేడా కొట్టేటట్లే కన్పిస్తుంది. అసలే అధికారంలో ఉన్న పార్టీ కావడం, వ్యతిరేకత ఉండటం, నాయకత్వ [more]

Update: 2021-02-01 18:29 GMT

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో సీట్ల పంపకం అధికార అన్నాడీఎంకేలో తేడా కొట్టేటట్లే కన్పిస్తుంది. అసలే అధికారంలో ఉన్న పార్టీ కావడం, వ్యతిరేకత ఉండటం, నాయకత్వ లేమి ఉండటంతో అన్నాడీఎంకే కూటమిలోని పార్టీలు ఎక్కువ స్థానాలను ఆశిస్తున్నాయి. కానీ పార్టీ నేతలను, క్యాడర్ ను కాపాడుకోవాలంటే ఎక్కువ స్థానాల్లో తామే పోటీ చేయాలని అన్నాడీఎంకే భావిస్తుంది. ఇందుకు కూటమిలోని పార్టీలను ఒప్పించే ప్రయత్నం ఆ పార్టీ చేస్తుంది.

మూడో వంతు స్థానాల్లో….

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే ఇందులో ప్రధాన పార్టీగా తాము 152 స్థానాల్లో పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. మూడో వంతు స్థానాల్లో తామే ఉండాలన్నది ఆ పార్టీ నిర్ణయంగా ఉంది. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, డీఎండీకే, టీఎంసీ, పుదియ తమిళగం వంటి పార్టీలున్నాయి. ఇందులో సామాజికవర్గాల పరంగా, ఓటు బ్యాంకు పరంగా బలంగా ఉన్న పార్టీలు పీఎంకే, డీఎండీకే మాత్రమే.

ఎక్కువ స్థానాలను….

అందుకే ఈ రెండు పార్టీలకు మిగిలిన స్థానాల్లో ఎక్కువ కేటాయించాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. ప్రధాన పార్టీగా ఉన్న పీఎంకే తమకు యాభై స్థానాలను కేటాయించాలని కోరుతుంది. కానీ 41 స్థానాలను మాత్రమే ఇచ్చేందుకు అన్నాడీఎంకే సిద్ధమయింది. ఇప్పటికే ఆ పార్టీ వన్నియార్ల రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తుంది. తిరిగి అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి పీఎంకేను బుజ్జగించాలని అన్నాడీఎంకే ప్రయత్నిస్తుంది. మరోవైపు పీఎంకే డీఎంకే కూటమిలో చేరేందుకు కూడా ప్రయత్నిస్తుంది.

కూటమిలోని పార్టీల్లో…..

దీంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పదిహేను స్థానాలను మాత్రమే కేటాయించాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. తమిళనాడులో బలహీనంగా ఉన్న బీజేపీకి ఇంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు మొగ్గ చూపడం లేదు. దీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరో ప్రధాన పక్షం డీఎండీకే కు కూడా కేవలం 18 స్థానాలను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. విజయకాంత్ దీనిపై అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. మొత్తం మీద అన్నాడీఎంకేకు సీట్ల పంపంకంలో కూటమి పార్టీ లనుంచి తేడా కొట్టేట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News