స్వల్పంగా పెరిగిన బంగారం ధర

ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై రూ.100లు పెరిగింది

Update: 2022-06-21 02:35 GMT

gold price today

బంగారం అంటేనే మగువలు ఫిదా అయిపోతారు. బంగారాన్ని కొనుగోలు చేయడానికి వారు ప్రధమ ప్రాధాన్యత ఇస్తారు. భారత దేశంలో ఈ తరహా మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకే బంగారం రేట్లు పెరగడానికి కారణమనే వారు లేకపోలేదు. బంగారం అంటే అదో అపురూప వస్తువుగా భావిస్తారు భారతీయ మహిళలు. అందుకే అంత డిమాండ్. ధరలతోనూ, సీజన్ తోనూ సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుపుతుండటంతో దానికి వన్నె తగ్గదు అన్నట్లుగానే క్రేజ్ ఎప్పుడూ తగ్గదు. అంతర్జతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు వంటి కారణాలు బంగారం రేట్లు హెచ్చుతగ్గుదలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.

వెండి మాత్రం..
ీఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై రూ.100లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,080 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,750 రూపాయలుగా ఉంది. వెండి కిలో ధర హైదరాబాద్ మార్కెట్ లో 63,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News