కర్రెగుట్ట అడవుల్లో కొనసాగుతున్న గాలింపు
ఛత్తీస్గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో ఆపరేషన్ కొనసాగుతుంది.
ఛత్తీస్ గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో ఆపరేషన్ కొనసాగుతుంది. భద్రతాదళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. అయితే తీవ్రమైన ఎండలతో కొందరికి వడదెబ్బ తగిలి భద్రతాదళాలు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ముమ్మరంగా గాలిపు చర్యలు చేపట్టారు. దాదాపు వెయ్యికి మందికిపైగానే మావోయిస్టులు కర్రెగుట్టలో తలదాచుకున్నారన్న సమాచారంతో కూంబింగ్ ను గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. అయితే కర్రెగుట్ట అడవుల్లో పెద్ద సొరంగాన్ని భద్రతాదళాలు కనుగొన్నాయి.
పెద్ద సొరంగంలో...
ఇందులో దాదాపు వెయ్యిమంది తలదాచుకునేలా ఈ గుహను నిర్మించారని చెబుతున్నారు. ఈ సొరంగంలో నీటి వసతితో పాటు అక్కడ కొన్ని నెలల పాటు ఉండటానికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారని భద్రతాదళాలు తెలిపాయి. అయితే ఇప్పటి వరకూ మావోయిస్టులు ఎంత మంది దొరికారన్న దానిపై అధికారిక సమాచారం అయితే లేదు. చాలా మంది అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.