కొత్త సీఎంగా సుఖ్వీందర్ సింగ్

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ పేరు ఖరారయింది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది.

Update: 2022-12-10 11:56 GMT

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ పేరు ఖరారయింది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. అనేక మంది పోటీలో ఉన్నా సుఖ్వీందర్ సింగ్ పేరును హైకమాండ్ ఖరారు చేసింది. వాస్తవానికి పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి రేసులో ముందున్నారు. అయితే ఆమె ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో హైకమాండ్ సుఖ్వీందర్ పేరును ఖరారు చేసిందంటున్నారు.

ప్రతిభా సింగ్ పట్ల...
ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ప్రతిభాసింగ్ పట్ల మొగ్గు చూపలేదు. దీంతో మాజీ పీసీీసీ చీఫ్ సుఖ్వీందర్ పేరు తెరమీదకు వచచింది. సుఖ్వీందర్ కు 25 మంది సభ్యులు మద్దతు ఇవ్వడంతో ఆయనవైపే అధినాయకత్వం మొగ్గు చూపింది. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుఖ్వీందర్ సింగ్ ఎప్పుడు ప్రమాణస్వీకారం చేయనున్నారన్నది త్వరలో తెలియనుంది.


Tags:    

Similar News