మరో యువమోడల్ ఆత్మహత్య..రెండు వారాల వ్యవధిలో నలుగురు సూసైడ్

బెంగాలీ మోడల్ సరస్వతీ దాస్ తెల్లవారుజామున 2 గంటలకు ఉరికి వేలాడుతూ కనిపించింది. అది చూసిన ఆమె అమ్మమ్మ ..

Update: 2022-05-30 05:12 GMT

కోల్ కతా : రెండు వారాల వ్యవధిలో బెంగాలీ వినోదరంగానికి చెందిన నలుగురు మోడల్స్ ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతున్నాయి. ఇటీవలే బిదిషా సూసైడ్ చేసుకోగా.. ఆ తర్వాత ఆమె స్నేహితురాలు మంజూషా కూడా బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా మరో 18 ఏళ్ల యువ మోడల్ సరస్వతీ దాస్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం కోల్ కతాలోని కస్బాలో బేడియాదంగా వద్ద తన గదిలోనే ఆదివారం తన గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

బెంగాలీ మోడల్ సరస్వతీ దాస్ తెల్లవారుజామున 2 గంటలకు ఉరికి వేలాడుతూ కనిపించింది. అది చూసిన ఆమె అమ్మమ్మ వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సరస్వతి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. తండ్రికి దూరంగా 17 ఏళ్లుగా సరస్వతి తన తల్లి ఆరతి దాస్, మేనమామతో కలిసి ఉంటోంది. మాధ్యమిక పరీక్షలో ఉత్తీర్ణురాలైన తర్వాత సరస్వతి.. ట్యూషన్ చెప్పడం, మోడలింగ్ చేయడంలో శ్రద్ధ చూపించింది. కాగా.. సూసైడ్ ప్రాంతంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. రాత్రి వరకూ ఆమె మాట్లాడిన ఫోన్ రికార్డింగ్స్ ను పరిశీలిస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News