గుడ్ న్యూస్... నిలకడగా గోల్డ్ రేట్స్

దేశంలో బంగారం ధరలు ఈరోజు నిలకడగా కొనసాగాయి. అలాగే వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

Update: 2022-06-20 02:24 GMT

దేశంలో బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. బంగారాన్ని పెట్టుబడిగా, పొదుపుగా చూసుకుంటారు భారతీయ మహిళలు. తమ ఇంట్లో ప్రతి శుభకార్యానికి బంగారాన్ని కొనుగోలు చేయాలని భావిస్తారు. చిన్న మొత్తంలో కాని, పెద్దమొత్తంలో కాని భారతీయ మహిళలు శుభకార్యాలకు బంగారాన్ని కొనుగోళ్లు చేయడం ఒక రివాజు. అదే భారతీయ సంస్కృతి సంప్రదాయం. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్ ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, బ్యాంకుల వద్ద ఉన్న బంగారం ఉన్న నిల్వలు వంటి కారణాలు కూడా బంగారం పెరుగుదల, తగ్గుదల కారణంగా చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.

ధరలు ఇలా...
దేశంలో బంగారం ధరలు ఈరోజు నిలకడగా కొనసాగాయి. అలాగే వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,090 రూపాయలుగా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధర 66.300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News