పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు బాగానే పెరిగాయి. రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు

Update: 2022-01-27 01:32 GMT

బంగారం ధర ఎప్పుడూ నిలకడగా ఉండదు. హెచ్చు తగ్గులు సహజమే. అయితే బంగారం ఎప్పుడైనా స్వల్పంగా ధర తగ్గుతుంది. పెరగడం మాత్రం భారీగానే పెరుగుతుంది. అందుకే స్వల్పంగా ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. ప్రధానంగా భారత్ లో బంగారం కొనుగోళ్లకు ఒక సీజన్ అంటూ లేకపోవడానికి ఇదే కారణమన్న విశ్లేషణలు కూడా ఉంటాయి.

ధరలు పెరిగి....
దేశంలో బంగారం ధరలు బాగానే పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 45,900 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,100 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా స్వల్పంగానే పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 68,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News