గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి

బంగారం ధరలు దేశ వ్యాప్తంగా కొంత తగ్గాయి. స్వల్పంగానే తగ్గినా బంగారం మదుపరులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

Update: 2022-01-24 01:40 GMT

బంగారం ధరల్లో మార్పులు సహజం. ఒకసారి పెరిగితే మరోసారి తగ్గుతుంటాయి. తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలను పరిశీలిస్తుంటారు. అలాగే కొత్త ఆభరణాలు మార్కెట్ లోకి వస్తే వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. తాజాగా బంగారం ధరలు దేశ వ్యాప్తంగా కొంత తగ్గాయి. స్వల్పంగానే తగ్గినా బంగారం మదుపరులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

ధరలు ఇలా...
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,490 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,630 రూపాయలుగా ఉంది. గత కొద్ది రోజులుగా వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కానీ నేడు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం 69,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News