గుడ్ న్యూస్... స్వల్పంగా తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి.

Update: 2022-01-23 01:38 GMT

బంగారం ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడకులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం కూడా బంగారం ధరలపై ఉంటుంది. అయితే ఈసారి అనుకున్న స్థాయిలో బంగారం ధరలు పెరగకపోవడం గుడ్డిలో మెల్లగా చెప్పుకోవాలి. అందుకే బంగారం కొనుగోళ్లు ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తులం బంగారంపై 110 రూపాయలు తగ్గింది.

వెండి ధరలు...
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,500 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,640 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి పై ఈరోజు ఐదు వందల రూపాయలు పెరిగింది. దీంతో మార్కెట్ లో కిలో వెండి 69,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News