కేజ్రీవాల్ కీలక నిర్ణయం... ఢిల్లీలో ఇక పెట్రోలు?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోలు ధరలపై వ్యాట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు

Update: 2021-12-01 07:02 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలపై వ్యాట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెట్రలో, డీజిల్ 30 శాతం ఉన్న వ్యాట్ పన్నును 19.8 శాతానిక ితగ్గించారు. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 103 రూపాయలకు చేరుకుంది. దీంతో లీటరు పెట్రోలు ధరపై కేజ్రీవాల్ సర్కార్ ఎనిమిది రూపాయలు తగ్గించినట్లయింది.

ఎన్నికలు ఏవీ లేకపోయినా..?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రాలు కూడా వ్యాట్ ను తగ్గించుకోవాలని కోరింది. దీంతో కేజ్రీవాల్ సయితం ఢిల్లీలో వ్యాట్ ను తగ్గించారు. ఢిల్లీలో ఎలాంటి ఎన్నికలు లేకపోయినా తాము ప్రజల పక్షాన నిలిచేందుకే వ్యాట్ ను తగ్గించామని కేజ్రీవాల్ సర్కార్ చెప్పుకుంది.


Tags:    

Similar News