మెగా షాపింగ్ ఫెస్టివల్ ను ప్రకటించిన ముఖ్యమంత్రి

ఆర్థిక వ్యవస్థను భారీగా ప్రోత్సహించడానికి.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా కీలక ప్రకటన చేశారు.

Update: 2022-07-06 10:42 GMT

ఆర్థిక వ్యవస్థను భారీగా ప్రోత్సహించడానికి.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా కీలక ప్రకటన చేశారు. 2023 సంవత్సరం ప్రారంభంలో దేశ రాజధాని ఢిల్లీలో 'మెగా షాపింగ్ ఫెస్టివల్'ని ప్రకటించారు. 2023 జనవరి 28 నుంచి 26 ఫిబ్రవరి 2023 వరకు 30 రోజుల పాటూ మెగా షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్ గురించిన వివరాలను కేజ్రీవాల్ తెలియజేస్తూ, అన్ని వస్తువులపై భారీ తగ్గింపులు ఉంటాయని, 30 రోజుల్లో 200 కాన్సర్ట్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఒక మ్యూజిక్ ఫెస్టివల్ రేంజిలో ఆయన ఢిల్లీలో మెగా షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించబోతున్నారు. "ఢిల్లీలో ఉపాధి, వ్యాపారం, ఆర్థికంగా ఎదగాలని ఎదురుచూసే వాళ్లకు గొప్ప వార్త. 2023 సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీలో ప్రపంచ స్థాయి షాపింగ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తుంది" అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇది వేళల్లో ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

30 రోజుల ఫెస్టివల్ ను ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. ఢిల్లీ సంస్కృతి, షాపింగ్‌ను అనుభవించడానికి ఆహ్వానించబడతారని ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పారు. ఢిల్లీ ఆహార సంస్కృతిపై ఆయన వ్యాఖ్యానిస్తూ.. ఢిల్లీ వివిధ రకాల వంటకాలకు ప్రసిద్ధి చెందింది. అందుకే 'ఢిల్లీ ఫుడ్ వాక్'లను ఏర్పాటు చేస్తామని, ఢిల్లీ నుంచే కాకుండా భారతదేశం నలుమూలల నుంచి కూడా వంటకాలు అందుబాటులో ఉంటాయన్నారు.
బయటి నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక రవాణా ప్యాకేజీలు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. "ప్రత్యేక రవాణా ప్యాకేజీలను ఏర్పాటు చేయడానికి మేము హోటళ్ళు, ట్రావెల్ ఏజెంట్లు, రవాణా సంస్థలు, విమానయాన సంస్థలతో మాట్లాడుతున్నాము" అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. దీని వల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుందని, ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఢిల్లీ వాసులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ప్రారంభ మరియు ముగింపు వేడుకలతో పాటు, 200 కచేరీలలో పాల్గొనడానికి భారతదేశం, ప్రపంచం నలుమూలల నుండి కళాకారులను ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు షాపింగ్ చేయడానికి అనేక వెరైటీలు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం ఢిల్లీని సుందరంగా తీర్చిదిద్దుతామని, భారతదేశం చూడని అతిపెద్ద ఈవెంట్‌గా ఇది ఉండబోతోందని ఆయన అన్నారు.


Tags:    

Similar News