దిగివచ్చిన హైకమాండ్

కాంగ్రెస్ హైకమాండ్ జీ 23 నేతల డిమాండ్లకు ఓకే చెప్పినట్లు తెలిసింది. త్వరలోనే సోనియా అసంతృప్త నేతలతో సమావేశం కానున్నారు.

Update: 2022-03-18 02:17 GMT

కాంగ్రెస్ హైకమాండ్ జీ 23 నేతల డిమాండ్లకు ఓకే చెప్పినట్లు తెలిసింది. త్వరలోనే సోనియా గాంధీ అసంతృప్త నేతలతో సమావేశం కానున్నారు. మొన్నటి వరకూ జీ 23 నేతలను దూరంగా పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దగ్గరకు తీసుకుంటుండం విశేషం. గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలోని జీ 23 నేతలు పలు దఫాలు సమావేశమై కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించారు. కిందిస్థాయి నుంచి సమన్వయం, సమిష్టి నాయకత్వం లేకపోతే కాంగ్రెస్ పార్టీ దేశంలో కోలుకోలేదని జీ 23 నేతలు సూచించారు.

చర్చలకు ఓకే...
అయితే సోనియా గాంధీ నిన్న గులాంనబీ ఆజాద్ తో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించుకుందామని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మరోవైపు రాహుల్ గాంధీ సయితం హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాతో సమావేశమై దాదాపు గంటన్నర సేపు చర్చించారు. ఇది శుభపరిణామమని జీ 23 నేతలు చెబుతున్నారు. అయితే భవిష్యత్ లో పార్టీ బలోపేతం కోసం ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ యోచిస్తున్నారని చెబుతున్నారు.


Tags:    

Similar News