భారత్ లో 21 కి చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఆరు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయట పడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.

Update: 2021-12-06 01:32 GMT

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ ఆరు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయట పడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ఎయిర్ పోర్టుల్లో ఎంత నిఘా పెట్టినా వైరస్ ను ఆపలేకపోతున్నారు. ప్రధానంగా విదేశాలు ముఖ్యంగా సౌతాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికులతోనే ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. ఇప్పటికి ఈ కేసుల సంఖ్య 21కి చేరుకుంది.

కర్ణాటకలో మొదలయి...
తొలుత కర్ణాటకలో ఇద్దరికి ఈ వేరియంట్ కనపడింది. తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలో ఒక్కొక్కరు చొప్పున ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు గుర్తించారు. మహారాష్ట్రలో ఒక్కసారిగా ఈ కేసుల సంఖ్య 8 కి పెరగడంతో దేశ వ్యాప్తంగా అలజడి పెరిగింది. తాజాగా రాజస్థాన్ లోనూ 9 మందికి ఒమిక్రాన్ వేరియంట్ కనపడింది.
ఆరు రాష్ట్రాల్లో....
ఇప్పటి వరకూ కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు, రాజస్థాన్ లో తొమ్మిది కేసులు, ఢిల్లీ, గుజరాత్ లలో ఒకటి, మహారాష్ట్రలో ఎనిమిది కేసులు బయటపడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ పోర్టుల్లో గట్టి నిఘా పెట్టాలని ఆదేశించింది.


Tags:    

Similar News