కొత్త ఏడాది బ్యాంకుల బాదుడు

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం కొత్త ఏడాది నుంచి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తే అదనపు భారం పడుతుంది

Update: 2021-12-07 06:47 GMT

ఎవరు పడితే వారు బాదేస్తున్నారు. ప్రభుత్వం పన్నులతో ప్రజలను బాదుతుండగా, ప్రజలకు సేవలందించాల్సిన సంస్థలు కూడా ప్రజలపైనే భారం మోపేందుకు సిద్ధమవుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం కొత్త ఏడాది నుంచి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తే అదనపు భారం పడుతుంది. పరిమితి దాటిన బ్యాంకు వినియోగారులపై ఏటీఎం ఛార్జీలను ఎప్పటి నుంచో వసూలు చేస్తున్నారు.

మరోసారి పెంచుతూ..
తాజాగా ఈ వసూలు ఛార్జిని ఇంకా పెంచుతూ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి బ్యాంకు లావేదేవీలు ఏటీఎంలలో అదనంగా జరిపితే ఇరవై రూపాయలతో పాటు జీఎస్టీ కూడా వసూలు చేస్తారు. ఏటీఎం నిర్వహణ ఖర్చులు పెరిగినందుకే ఈ ఛార్జీల భారం మోపక తప్పడం లేదని బ్యాంకు యాజమాన్యాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News