వీధికుక్కల బారి నుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ.. బోరు బావిలో పడ్డ బాలుడు

చిన్నారికి ప్రాణవాయువు సరఫరా చేస్తూనే బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వుతున్నట్లు అధికారులు తెలిపారు.

Update: 2022-05-22 12:53 GMT

పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివారం ఆరేళ్ల పిల్లాడు 100 అడుగులకు పైగా లోతున్న బోరుబావిలో పడిపోయాడు. జాతీయ విపత్తు సహాయ దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్), భారత సైన్యం ఘటనా స్థలానికి చేరుకుని పిల్లాడిని బావి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నారికి ప్రాణవాయువు సరఫరా చేస్తూనే బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన హోషియార్‌పూర్‌లోని ఖ్యాలా గ్రామంలో చోటుచేసుకుంది. పిల్లవాడు పొలంలో ఆడుతుండగా, కొన్ని వీధి కుక్కలు అతనిని వెంబడించడం ప్రారంభించాయి. అతను జనపనార సంచితో కప్పబడిన బోర్‌వెల్ షాఫ్ట్ ఎక్కాడు.. బాలుడి బరువును తట్టుకోలేకపోవడంతో అతడు బాలుడు బావిలో పడిపోయాడు.

డిప్యూటీ కమిషనర్‌ సందీప్‌ హన్స్‌, ఎస్‌ఎస్పీ సర్తాజ్‌ చాహల్‌ కూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కెమెరాలలో అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడని గుర్తించారు. చిన్నారిని సురక్షితంగా రక్షించేందుకు మరో ఆర్మీ ఇంజనీర్‌ల బృందాన్ని పిలిచినట్లు అధికారులు చెప్పారు. అత్యవసర సేవల కోసం వైద్య బృందాలు కూడా ఉన్నాయి. చిన్నారిని రక్షించేందుకు జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. "హోషియార్‌పూర్‌లో హృతిక్ అనే 6 ఏళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. నేను అడ్మినిస్ట్రేషన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నాను..." అని పంజాబీలో ఆయన ట్వీట్ చేశారు.
నివేదికల ప్రకారం, రెస్క్యూ ఆపరేషన్ కోసం సైన్యాన్ని రప్పించారు. బోర్‌వెల్ వైపు సొరంగం తవ్వేందుకు జేసీబీని ఉపయోగిస్తూ ఉన్నారు. గంటన్నర వ్యవధిలో 15 అడుగుల మేర మాత్రమే తవ్వగలిగింది. బాలుడు బోరుబావిలో 95 అడుగుల మార్క్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటన ఉదయం 9 గంటలకు చోటు చేసుకున్నట్లు సమాచారం. బోర్‌వెల్‌లో తలకిందులుగా పడిపోవడంతో క్లిప్ సహాయంతో బయటకు తీసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.


Tags:    

Similar News