రంగ‌స్థ‌లం షార్ట్ & స్వీట్ రివ్యూ

Update: 2018-03-30 03:17 GMT

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమాపై టాలీవుడ్ గ‌త యేడాది కాలంగా చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. సుకుమార్ డైరెక్ట‌ర్ కావ‌డం, అక్కినేని కోడ‌లు స‌మంత ఈ సినిమాలో న‌టించేందుకు ఓకే చెప్పిన‌ప్ప‌టి నుంచి సినిమాపై అంచ‌నాలు నెల‌కొన్నాయి. ముఖ్యంగా సుక్కు - చెర్రీ కాంబినేష‌న్ ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తితో పాటు మైత్రీ మూవీస్ వారి నిర్మాణ విలువ‌లు కూడా భారీగా ఉండ‌డంతో రంగ‌స్థ‌లం సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుంద‌ని అంద‌రూ ఎదురు చూస్తున్నారు.

చెర్రీ ధృవ సినిమా త‌ర్వాత యేడాదిన్న‌ర గ్యాప్‌, ఇటు సుక్కు నాన్న‌కుప్రేమ‌తో లాంటి క్లాస్ హిట్ త‌ర్వాత రెండేళ్ల‌కు పైగా గ్యాప్ తీసుకుని చేసిన రంగ‌స్థ‌లం బాక్సాఫీస్ వ‌ద్ద ర‌చ్చ చేసేందుకు శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి దిగింది. మ‌రి ప్రీమియ‌ర్ షోల త‌ర్వాత రంగ‌స్థ‌లంకు ఎలాంటి టాక్ వ‌చ్చిందో షార్ట్ రివ్యూలో చూద్దాం.

ముందుగా దర్శకుడు పాత్రలను పరిచయం చేసిన తీరు చాలా బావుంది. ఈ మూవీ మొత్తం 1980వ సంవ‌త్స‌రంలో జ‌రిగిన స్టోరీగా సుకుమార్ చెబుతూ వ‌చ్చాడు. దీనిని మూవీలో కొన్ని సీన్స్‌తోనే అర్ధ‌మ‌య్యేలా అద్భుతంగా షూట్ చేశాడు. రంగస్థలం అనే ఊరు.. 1980వ‌ కాలం.. వంటి కీల‌కమైన అంశాల‌ను కొన్ని సీన్స్ తోనే అర్థమయ్యేలా దర్శకుడు చేప్పేశాడు. ఇక‌, హీరొగా రామ్ చరణ్ తన కెరీర్ లో ఈ సినిమాలో ఇచ్చినంత సింపుల్ ఎంట్రీ ఎందులోనూ ఇవ్వలేదనే చెప్పాలి. సైకిల్ పైన వస్తుండడం. ఆ తరువాత ఫన్నీగా మిగతా పాత్రలు కలవడం చాలా స్పీడ్ గా కథ ముందుకు వెళుతుంటుంది.

దీంతో సినిమా అర్ధాన్ని చెప్పేలా రంగా రంగ రంగస్థలాన అనే పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక రంగమ్మ పాత్రలో అనసూయ వెరైటీగా ఎంట్రీ ఇవ్వగా.. జగపతి బాబు చాలా సైలెంట్ గా ఉంటూనే భయంకరంగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నటన చాలా బావుంటుంది. ప్ర‌కాష్‌రాజ్ క్యారెక్ట‌ర్ ట్విస్ట్ చివ‌రి వ‌ర‌కు తెలియ‌క‌పోవ‌డం బాగుంది. ఆది పినిశెట్టి చిట్టి బాబు అన్నయ్యగా.. రోహిణి – నరేష్ వారి తల్లిదండ్రులుగా కనిపించారు. కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్, కామెడీ సన్నివేశాలు అలాగే ప్రకాష్ రాజ్ పాలిటిక్స్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో హైలెట్ గా నిలిచాయి. సమంత ఎంట్రీ తో వచ్చే ఎంత సక్కగున్నావే సాంగ్ కూడా మరో హైలెట్. సమంత నటన కూడా బాగానే ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ కి ముందు కథలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి.

ఇక‌, సినిమా నిడివి ఎక్కువగా ఉండడం పెద్ద మైనెస్ అని చెప్పాలి. ఎలక్షన్స్ కి సంబందించిన సన్నివేశాలు ఎక్కు వగా ఉంటాయి. అయితే సెకండ్ హాఫ్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎక్కువగా ఊహించిన సన్నివేశాలే వస్తుంటాయి. డైలాగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. యాక్షన్స్ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. మొత్తంగా సినిమాలో చరణ్ నటన హైలెట్ గా నిలుస్తుంది. చెవులు వినిపించని చిట్టిబాబుగా చెర్రీ కనబరిచిన హావభావాలు అలాగే సినిమా పాటలు మరో బలం. సెట్స్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కానీ మొత్తంగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి. 1980 నాటి క‌థ అని చెప్పినా ఇది 1960ల నుంచి చూస్తూనే ఉన్నాం... పాత క‌థ‌ను ఈ త‌రం న‌టుల‌తో కొత్త‌గా చెప్పేందుకు సుకుమార్ మంచి ప్ర‌య‌త్న‌మే చేసినా ఆ ఫీల్‌, ఎమోష‌న‌ల్ క‌నెక్ట్ కాలేదు. సినిమా క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ మాత్రం చెప్ప‌లేం. పూర్తి రివ్యూతో మ‌రికొద్ది సేప‌ట్లోనే క‌లుద్దాం.

Similar News