మూవీ రివ్యూ: సాహసం శ్వాసగా సాగిపో

Update: 2016-11-11 09:15 GMT

నటీనటులు : నాగ చైతన్య, మంజిమ మోహన్

సంగీతం : ఏ.ఆర్.రహమాన్

నిర్మాత : రవీందర్ రెడ్డి

దర్శకత్వం : గౌతమ్ మీనన్

నాగ చైతన్య కెరీర్ ని నిలబెట్టిన సినిమా 'ఏమాయ చేసావే'. ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. నాగ చైతన్య మొదటి చిత్ర జోష్ తో నిరాశపరిచినా 'ఏమాయ చేశావే' తో టాలీవుడ్ లో హీరో గా సెటిల్ అయ్యాడు. ఆ సినిమా తర్వాత మాస్ చిత్రాల వెంటపడి చేతులు కాల్చుకున్న చైతు '100 % లవ్, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్' చిత్రాలలో లవర్ బాయ్ గా కనిపించి హిట్స్ కొట్టాడు. ఇక ఈ 'సాహసం...' సినిమా కూడా లవ్ కమ్ మాస్ జోనర్ ఉన్నట్టు ట్రైలర్స్ చూస్తే అర్ధమవుతుంది. ఇక 'ఏమాయ చేసావే' సినిమా హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యింది. ఈ చిత్రానికి ఏ.ఆర్.రహమాన్ సంగీతం సమకూర్చడం, గౌతమ్ దర్శకత్వం వహించడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం... చైతు 'ప్రేమమ్' చిత్రం కంటే ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ఈ రోజు నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మొన్నొచ్చిన 'ప్రేమమ్' చిత్రం తో భారీ హిట్ కొట్టిన నాగ చైతన్య 'సాహసం....'తో ఎటువంటి హిట్ ని సొంతం చేసుకున్నాడో... సమీక్షలో తెలుసుకుందాం.

కథ: రజినీకాంత్ ఉరఫ్ చిన్నా(నాగ చైతన్య) చదువు పూర్తి చేసుకుని... ఉద్యోగం కోసం వెంపర్లాడకుండా... ఎంజాయ్ చేస్తూ జీవితం లో సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఏంటో సింపుల్ గా కోరికలేం లేకుండా జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. చిన్నా చెల్లెలు మైత్రేయి ఫ్రెండ్ లీలతో (మంజిమ మోహన్) చిన్నా కి పరిచయం ఏర్పడుతుంది. ఇక మైత్రేయి ఇంట్లో ఉంటూనే దర్శకురాలిగా ట్రై చేస్తుంది లీల. చిన్నాతో లీల పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఇక చిన్నా తనకిష్టమైన పనులు చేస్తూ గడిపేస్తుంటాడు. అలాగే ఒక రోజు బైక్ మీద వెళ్లి కన్యాకుమారిని చూడాలనుకుంటాడు. ఆ బైక్ మీద అనుకోని పరిస్థితుల్లో లేల ని కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది చిన్నాకి. ఇక కన్యాకుమారి ని చూసాక లీల, చిన్నలిద్దరు మహారాష్ట్రకు బయలుదేరుతారు. ఇక వారికి మార్గ మధ్యలో వారికి అనుకోకుండా ఆక్సిడెంట్ అవుతుంది. అలాగే కొంతమంది దుండగులు లీలా మీద దడి చేస్తారు. అదే సమయం లో మహారాష్ట్రలో ఉన్న లీలా కుటుంబం కూడా ఆపదలో పడుతుంది. అసలు ఆక్సిడెంట్ అయిన వారు ఎలా ఉన్నారు? లీలా కి దుండగులకు సంబంధం ఏమిటి? అసలు లీల కుటుంబం ఏ ఆపదలో చిక్కుకుంటుంది. వీటన్నిటిని చిన్నా, లీలా లు అధిగమించరా? లేదా? అనేది తెరపై చూడాల్సిందే.

పనితీరు: ఏమాయ చేసావే చిత్రం తో దర్శకుడుగా గౌతమ్ మీనన్, నాగ చైతన్యని హీరోగా నిలబెట్టాడు. ఇక మళ్ళీ అదే హిట్ కాంబినేషన్ రిపీట్ అవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సాహసం చిత్రం కంప్లీట్ అయ్యాక కూడా అనేకసార్లు వాయిదా పడడం తో ఈ సినిమా పై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇక ఈ సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని దర్శకుడు గౌత మీనన్ రెండు భాగాలూ గా తీసాడని చెప్పాలి. మొదటి భాగం సింపుల్ రొమాంటిక్ గా తీసి రెండో భాగం లో యాక్షన్ సన్నివేశాలతో నింపేసాడు. మొదటి భాగానికి రెండో భాగానికి లింక్ లేకుండా చేసి గజి బిజీ చేసేసాడు. ఇక క్లైమాక్ ని పూర్తిగా చెడగొట్టేసాడు. ఈ సినిమాకి ప్రధాన మైనస్ క్లైమాక్ అని చెప్పుకునే రీతిలో క్లైమాక్స్ ని తెరకెక్కించాడు. అసలు మొదటి భాగానికి రెండో భాగానికి లింక్ లేకుండా తీసి క్లైమాక్స్ ని మరో పద్దతిలో ప్రెజెంట్ చేసాడు.

ఇక నాగ చైతన్య మాత్రం తనకిష్టమైన బైక్ రైడింగ్ లో అద్భుతం గా నటించాడు. చాలా నేచురల్ గా లవర్ బాయ్ గా బాగా నటించాడు. ఇక హీరోయిన్ విషయానికొస్తే మంజిమ మోహన్ తాన్ పాత్రకి న్యాయం చేసింది. నాగ చైతన్యతో కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యింది. ఆమె నటన పరం గా కూడా ఓకె అనిపించుకుంది. ఇక ఏ.ఆర్ రెహ్మాన్ పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించింది. ఇక సాహసం ఎడిటింగ్ విషయానికొస్తే ఎడిటింగ్ పరం గా ఈ సినిమాకి అతి పెద్ద మైనస్. ఎడిటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టాల్సింది. ఇక స్లో నేరేషన్ కూడా సినిమా వీక్ అవడానికి మరో మైన్స్ పాయింట్.

ప్లస్ పాయింట్స్: నాగ చైతన్య, మంజిమ మోహన్, పాటలు, దర్శకత్వం

మైన్స్ పాయింట్స్: కథ, కథనం, స్లో నేరేషన్, క్లైమాక్స్, ఎడిటింగ్

రేటింగ్: 2 /5

Similar News