మనవూరి రామాయణం రివ్యూ

Update: 2016-10-07 13:40 GMT

నటీనటులు : ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్

సంగీతం : ఇళయరాజా

నిర్మాత : ప్రకాష్ రాజ్, రాంజీ నరసీమాన్

దర్శకత్వం : ప్రకాష్ రాజ్

తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటుడు ప్రకాష్ రాజ్. నటనలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని.... విలన్ అంటే ఇలానే ఉంటాడా అని... తండ్రి అంటే ప్రకాష్ రాజ్ అని అనుకునేలా సినిమాల్లో తన పాత్రలో జీవించాడు. ఆయనకు తండ్రిగా ఎంతమంచి పేరైతే వచ్చిందో విలన్ గా కూడా అంతే మంచి పేరు తెచ్చుకుని విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. 'బొమ్మరిల్లు' ఫాదర్ అనగానే టక్కున ప్రకాష్ రాజ్ గుర్తొచ్చేలా ఆ సినిమాలో నటన ప్రకాష్ రాజ్ ని ఎంతో ఎత్తులో నిలబెట్టింది. తనలోని ప్రతిభని కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కూడా కొన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరించి పలువురి ప్రశంశలు కూడా అందుకున్నాడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన చిత్రం ‘ మన ఊరి రామాయణం’.. ట్రైలర్స్ తో అందరిలో ఆసక్తి కలిగించిన ఈ చిత్రం లో ప్రియమణి, సత్యదేవ్ లు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ప్రియమణి కూడా తెలుగులో చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా కావడం తో ఆమెకు కూడా ఈసినిమా మంచి అనుభవాన్ని ఇచ్చిందని ఆమె కొన్ని సందర్భాల్లో ఇప్పటికే చెప్పింది. ఈ 'మన ఊరి రామాయణం' సినిమాతో ప్రకాష్ రాజ్ ఒక దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకులని ఏ మాత్రం మెప్పించగలిగాడో సమీక్ష లో తెలుసుకుందాం.

కథ: ఒక ఊర్లో పేరు పలుకుబడి, పెద్ద పేరు సంపాదించుకుని దర్జాగా బ్రతికే ఒక వ్యక్తి భుజంగయ్య(ప్రకాష్ రాజ్), భుజంగయ్య పెద్దమనిషిగా చాలామణీ అవుతూ అందరిలో మంచి పేరు సంపాదించుకుని జీవితాంతం ఒక పరువు ప్రతిష్టలతో గడపాలన్నదే అతని కోరిక. సమాజం లోనే కాకుండా ఇంట్లో కూడా ఎంతో గౌరవ మర్యాదలు కలిగి ఉన్న భుజంగయ్య కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఇంట్లో జరిగిన చిన్న గొడవ వల్ల ఇంటినుండి కోపం తో బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఆ కోపంలో ఓ వేశ్య (ప్రియమణి) తో ఆనందం గా గడపాలను డిసైడ్ అవుతాడు. అక్కడికెళ్లిన భుజంగయ్య వేశ్యతో పాటు కొన్ని పరిస్థితుల వల్ల తన ఇంటికి ఆనుకుని ఉండే ఓ చిన్న షాప్ లో ఇరుక్కుపోతాడు. మరి అసలే గొప్ప పరువు, ప్రతిష్టలు లతో తాను మంచి పేరు సంపాదించుకున్నాక ఇలా ఒక వేశ్యతో గడిపాడని తెలిస్తే ఉన్న పరువు, ప్రతిష్టలు పోతాయని భుజంగయ్య అక్కడి నుండి ఎవరికీ తెలీకుండా ఎలా బయట కు వచ్చాడో..... అన్నది తెరమీద చూడాల్సిందే.

పనితీరు: విలక్షణ నటుడిగా ఎన్ని పాత్రల్లో మెప్పించిన ప్రకాష్ రాజ్ భుజంగయ్య పాత్రలో తన నటనలో మరో కోణాన్ని 'మన ఊరి రామాయణం' లో ఆవిష్కరించాడు. ఎలాంటి కేరెక్టర్ అయినా అందులో ఒదిగిపోయి నటించే ప్రకాష్ రాజ్ భుజంగయ్య పాత్రలో ప్రతి చిన్న ఎమోషన్ ని ఎంతో నేర్పుగా చూపించాడు. అసలు క్లైమాక్స్ లో అయితే ప్రకాష్ రాజ్ నటన మెచ్చుకోకుండా ఉండలేరు. ప్రియమణి వేశ్య గా అందరిని ఆకట్టుకుందని చెప్పాలి. సింపుల్ గా ఆ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయింది. సినిమా పూర్తికావస్తున్న సమయంలో మంచి నటన కనపరిచింది. సత్యదేవ్ ప్రకాష్ రాజ్ నమ్మిన బంటుగా తాను నటనతో పూర్తి న్యాయం చేసాడు.పృథ్వి నటనలో వేరియేషన్ ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. అన్ని సినిమాల్లో ఎప్పుడూ కామెడీ పాత్రలతో మెప్పించే ఈ కమెడియన్ పృథ్వి ఓ బలమైన సీరియస్ నెస్ ఉన్న పాత్రలో నటించి అందర్నీ మెప్పించాడు.

ఇక దర్శకుడిగా ప్రకాష్ రాజ్ మంచి బలమున్న కథనే ఎంచుకున్నాడు. బయటికి రాముడిలా కనిపించి కొన్ని పరిస్థితుల్లో రావణాసురుని గ మారి తనకి మరో కోణం కూడా ఉందని కూడా చూపించాలని ప్రయత్నం చేసాడు. ఈ కథతో కొంత మంది ప్రేక్షకులని మెప్పించాడనే చెప్పొచ్చు. కానీ కొంతమంది దీనిని అంత తేలికగా రిసీవ్ చేసుకోలేరు. ఇక ఇళయరాజా ఆర్, ఆర్ చంపేశాడనే చెప్పాలి. మంచి మ్యూజిక్ ని ఈ సినిమాకి అందించి ఈ సినిమాని విజయం వైపు నడిపించే ప్రయత్నం చేసాడనే చెప్పాలి.కథకు తగ్గట్టు సంగీతాన్ని అందించాడు మేస్ట్రో ఇళయరాజా. ముఖేష్ ఫోటోగ్రఫి పర్వాలేదనిపించారు.

ప్లస్ పాయింట్స్: కథ, ప్రకాష్ రాజ్, ప్రియమణి, ఆర్,ఆర్, మ్యూజిక్

మైనస్ పాయింట్స్ ; స్లో నేరేషన్, కథనం, దర్శకత్వం

రేటింగ్: 2.25/5

Similar News