నాని ' ఎంసీఏ ' షార్ట్ & స్వీట్ రివ్యూ

Update: 2017-12-21 02:01 GMT

వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచుర‌ల్ స్టార్ నాని ఇప్ప‌టికే డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాతో ప్రారంభ‌మైన నాని విజ‌యాల ప‌రంప‌ర కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ యేడాది కూడా నాని ఇప్ప‌టికే నేను లోక‌ల్‌, నిన్న కోరి సినిమాల‌తో హిట్లు కొట్టి హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ యేడాది ఐదు హిట్లు కొట్టి ఏంసీఏ సినిమాతో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టాల‌ని క‌సితో ఉన్నాడు. మ‌రి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఏంసీఏ సినిమా ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియ‌ర్ షో టాక్ ప్ర‌కారం ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

నాని స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ భూమిక‌ నాని వ‌దిన‌గా న‌టించింది. నాని సినిమా అంటే జ‌నాల్లో హిట్ అన్న న‌మ్మకం వ‌చ్చేసింది. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ రొటీన్ స్టోరీ ఎంచుకున్నాడ‌న్న టాక్ వ‌స్తోంది. సినిమాలో ఫ‌స్టాఫ్ ఎంట‌ర్‌టైనింగ్ ముందుకు సాగుతూ ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేసేలా ఉంది.

ఇక సెకండాఫ్‌పై ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న ప్రేక్ష‌కుడు ప‌ర‌మ రొటీన్ స‌న్నివేశాలతో బోర్ ఫీల‌వుతాడు. రొటీన్ స్టోరీకి తోడు, ముందే ఊహించే సీన్లతో మూస ఫార్మాట్‌లో ఉంది. ఇక సినిమాలో కామెడీ, నాని - సాయి పల్ల‌వి మ‌ధ్య వ‌చ్చే సీన్లు బాగున్నాయి. దిల్ రాజు నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ఇక రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్‌లో కొత్త‌ద‌నం లేదు.

నాని వ‌దిన‌గా భూమిక క్యారెక్ట‌ర్ ఎంతో ఉంటుంద‌ని అంద‌రూ ఊహించుకుంటే, అందులోనూ కొత్త‌ద‌నం లేదు. ఓవ‌రాల్‌గా చెప్పాలంటే నాని వ‌రుస విజ‌యాల ప‌రంప‌ర‌ను ఈ సినిమా కొనసాగించడం చాలా క‌ష్టం. సినిమా ప‌రంగా కాకుండా నాని కోసం జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళితే త‌ప్పా ఈ సినిమా గ‌ట్టెక్కే అవ‌కాశాలు లేవు. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్‌.కామ్

Similar News