జయమ్ము నిశ్చయమ్ము రా రివ్యూ

Update: 2016-11-25 10:31 GMT

నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ, రవి వర్మ

సంగీతం : రవిచంద్ర

నిర్మాత : శివ రాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి

దర్శకత్వం : శివ రాజ్ కనుమూరి

టాలీవుడ్ లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన చాలామంది కమెడియన్స్ హీరోలుగా సెటిల్ అయిపోతున్నారు. అయితే హీరోలయినప్పటికీ కామెడీని వదలకుండా రెండిటీని బ్యాలెన్స్ చేసేవారు కూడా వున్నారు. అలా రెండిటీని బ్యాలెన్స్ చేస్తూ ఉన్న కమెడియన్ శ్రీనివాసరెడ్డి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. శ్రీనివాస రెడ్డి కమెడియన్ గా తెలుగులో కొనసాగుతూనే 'గీతాంజలి' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక 'గీతాంజలి' చిత్రం శ్రీనివాస్ రెడ్డి కి మంచి విజయాన్ని అందించింది. ఆ విజయం తెచ్చిన ఉత్సాహం తో మళ్ళీ మరోసారి హీరోగా తనని తాను 'జయమ్ము నిశ్చయమ్ము రా' చిత్రంతో తనని తాను మరోసారి పరీక్షించుకోబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిట్రైలర్స్, టీజర్స్ అన్ని మంచి రెస్పాన్స్ పొందడం.... అలాగే పెద్ద దర్శకులు అందరూ ఈ సినిమాకి మంచి సుపోర్టునివ్వడం వంటివి ఈ సినిమా విడుదలకు ముందు మంచి పుబ్లిసిటీగా ఉపయోగ పడ్డాయిట. ఇంత పాసిటివ్ టాక్ వున్న ఈ 'జయమ్ము నిశ్చయమ్ము రా' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం సమీక్షలో తెలుసుకుందాం.

కథ: తెలంగాణ లో సదాశివ పల్లెలో నివసించే సర్వమంగళం (శ్రీనివాస రెడ్డి)కి మూఢ నమ్మకాలంటే పిచ్చి. ఇక మూఢనమ్మలకు గట్టిగా నమ్ముతూ... వాటికోసం స్వామిజీలను కూడా నమ్ముతూ ఉండే సర్వమంగళానికి కాకినాడలో ఉద్యోగం వస్తుంది. కాకినాడలోని మీ సేవ ఆఫీస్ లో పనిచేసే రాణి(పూర్ణ) ని గాఢం గా ప్రేమిస్తాడు. ఇక ఆమెను పెళ్లి చేసుకుని సొంత ఊరు సదాశివ పెళ్లికి మకాం మార్చాలని చూస్తుంటాడు. ఆ క్రమంలోనే బాస్ జెసి (రవివర్మ) కి సర్వమంగళానికి మధ్య విభేదాలొస్తాయి. మరోపక్క రాణి కూడా వేరెవరినో ప్రేమిస్తుంటుంది. మరి ఇన్ని ఇబ్బందుల మధ్య రాణి ని సర్వమంగళం పెళ్లి చేసుకున్నాడా? అసలామెను సర్వమంగళం ఎలా దక్కించుకుంటాడు? బాస్ జెసితో అసలు సర్వమంగళం ఎందుకు గొడవ పెట్టుకున్నాడు? అలాగే తన ఉద్యోగాన్ని తన ఊరికి మార్చుకున్నాడా? అనేది తెలియాలంటే ఖచ్చితం గా తెర మీద 'జయమ్ము నిశ్చయమ్ము రా' చిత్రాన్ని తిలకించాల్సిందే.

పనితీరు: సర్వమంగళం పాత్రలో శ్రీనివాస్ రెడ్డి చాలా అద్భుతం గా నటించాడు. ఆ పాత్రలో నటించాడు అనడం కంటే జీవించాడని అని చెప్పొచ్చు. పిరికివాడిగా, ఒక ప్రేమికుడిగా తన పాత్రకి న్యాయం చేసాడు. వైవిధ్యం గా నటించి అందరి మెప్పు పొందాడు. ఇక హీరోయిన్ పూర్ణ తెలుగుదనం ఉట్టిపడేలా నటించి మెప్పించింది. కానీ నటన పరం గా ఆమె పాత్రకి పెద్దగా స్కోప్ లేకుండా చేసాడు దర్శకుడు. ఇక జేసీగా రవి వర్మ, బ్రాహ్మణుడిగా పోసాని తమ పరిధిలో బాగానే నటించారు.

ఇక దర్శకుడు శివ రాజ్ కనుమూరి గురించి చెప్పాలంటే రోజు మన జీవితాల్లో జరిగే పరిణామాలని కథగా ఎంచుకుని సినిమాగా తెరకెక్కించాడు. అయితే ఇక్కడ తెలంగాణ అబ్బాయికి, ఆంధ్ర అమ్మాయికి మధ్య ప్రేమను ఒక కథగా చూపించాలనుకున్నాడు. ఇక కామెడీ కి కూడా కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి కథను నడిపెయ్యాలనుకున్నాడు. అయితే మొదటి 20 నిముషాలు బాగానే సాగినా తర్వాత సినిమా మొదటి హాఫ్ లో సెకండ్ హాఫ్ లో కథ, కథనం నెమ్మదించడం సినిమాకి మైనస్ పాయింట్. కొంచెం కథ , కథనం నెమ్మదించడం తో ప్రేక్షకులు బోర్ ఫీలవుతుంటారు. ఇక సంగీతం విషయానికొస్తే పాటలు పెద్దగా అలరించలేకపోయాయి. సంగీతం చాల సింపులుగా అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించింది. ఎడిటింగ్ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. కొన్ని కొన్ని సీన్స్ కట్ చేస్తే సినిమా కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక సినిమాటోగ్రఫీ చాలా బావుంది. పల్లెటూరి అందాలను బాగా తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్: శ్రీనివాస్ రెడ్డి నటన, కామెడీ, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, స్లో నేరేషన్, దర్శకత్వం, ఎడిటింగ్

రేటింగ్: 2 .5 /5

Similar News