కిట్టు ఉన్నాడు జాగ్రత్త మూవీ రివ్యూ ( రేటింగ్: 2 .5 /5 )

Update: 2017-03-03 15:02 GMT

నటీనటులు: రాజ్ తరుణ్, అను ఇమాన్యువల్, హంస నందిని, నాగబాబు

మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్

నిర్మాత: సుంకర రామ బ్రహ్మం

దర్శకత్వం: వంశి కృష్ణ

'ఉయ్యాలా జంపాల' తో తెలుగు తెరకు పరిచయమైన రాజ్ తరుణ్ వరుస హిట్స్ తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. వరుస హిట్స్ తో దూసుకు పోతున్న రాజ్ తరుణ్ కి మధ్యలో కొన్ని చిత్రాలు నిరాశ పరిచిన కూడా ఏమాత్రం తొందరపడకుండా వచ్చిన కథల్లో బెస్ట్ కథని ఎంపిక చేసుకుని చిత్రాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా నిర్మాతల పాలిట బెస్ట్ హీరోగా మారిపోయిన రాజ్ ఇప్పుడు 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'తో మళ్ళీ హిట్ కొట్టాలనే కసితో ఈ చిత్రాన్ని చేసి ప్రమోషన్లతో చిత్రంపై అంచనాలను పెంచేసాడు. అసలు రాజ్ తరుణ్ చిత్రాలు కామెడీ ప్రాధాన్యం గా తెరకెక్కుతాయి. కొన్నిసార్లు మాస్ టచ్ చేసి బోర్లా పడిన రాజ్ తరుణ్ మళ్ళీ తన పాత ఫార్ములాతోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇక కుక్కపిల్లని కిడ్నప్ చేసి.... సినిమా మొత్తం కుక్కపిల్ల చుట్టూ తిరిగేలా చూపించే ట్రైలర్స్ తో సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా చేసిన ఈ 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'తో ఏమాత్రం ఆకట్టుకున్నాడో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: ఒక సాధారణ కారు మెకానిక్ అయిన కిట్టు( రాజ్ తరుణ్) జానూ (అను ఇమ్మాన్యువల్) ప్రేమలో పడతాడు. జానూ తో ప్రేమలో ఉండగానే కిట్టు కిడ్నాపర్ గా మారుతాడు. అయితే కిట్టు మనుషులని కిడ్నాప్ చెయ్యకుండా ఉన్నతకుటుంభాలు పెంచుకునే కుక్కలని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేస్తుంటాడు. ఇలా సంపాదిస్తున్న డబ్బు గురించి జనుకు తెలియడంతో ఆమె కిట్టు కి దూరం గా వెళ్ళిపోతుంది. జానూ దూరమైనా క్షణం లోనే కిట్టు చెయ్యని తప్పుకు బలవుతాడు. ఒక తప్పుడు కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు వల్ల నానా కష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి కిట్టు కి ఎదురవుతుంది. అసలు కుక్కల్నే కిట్టు ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? కిట్టు మెడకు చుట్టుకున్న ఆకేసు ఏమిటి? ఆ కేసునుండి బయట పడి జాను ని కలుస్తాడా? అనే విషయాలన్నీ తెర మీద చూస్తేనే బావుంటుంది.

నటీనటుల పాత్ర: రాజ్ తరుణ్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. మాస్ యాంగిల్ తో మెప్పించాడు. ఎప్పుడు విభిన్నం గా నటిస్తూ మెప్పించే రాజ్ తరుణ్ ఈసారి కూడా అలాంటి నటనతోనే మెస్మరైజ్ చేసాడు. యాక్షన్ సన్నివేశాల్లో, కామెడీ పరం గా రాజ్ తరుణ్ జీవించేసాడు. అలాగే హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ తన అందచందాలతో తన పాత్రలో ఒదిగిపోయింది. గ్లామర్ గా కూడా అను ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మెయిన్ హైలెట్ హంస నందిని ఐటెం సాంగ్. ఆ ఐటెం లో హంస రెచ్చిపోయి డాన్స్ చేసింది. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు: దర్శకుడు కిట్టు కథని మరింత బలం గా రాసుకుని ఉంటే బావుండేది. డైలాగ్స్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా మలచగలిగాడు. కామెడీకి పెద్ద పీట వేసాడు. ఇక స్క్రీన్ ప్లే ని కామెడీగా నడిపించి సక్సెస్ అయ్యాడు. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకి ఏవిధం గా ప్లస్ అవ్వలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా డల్ గా వుంది. పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ హైలెట్. ఎడిటింగ్ లో చిన్న లోపాలు కనబడ్డాయి. నిర్మాణ విలువలు ఆకట్టుకునేలా వున్నాయి.

ప్లస్ పాయింట్స్: రాజ్ తరుణ్, కామెడీ, ఐటెం సాంగ్, మాస్ ఎలిమెంట్స్

మైనస్ పాయింట్స్: మ్యూజిక్, క్లైమాక్స్, పాటలు

రేటింగ్: 2 .5 /5

Similar News