ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ రివ్యూ 

Update: 2016-11-18 11:06 GMT

నటీనటులు : నిఖిల్, హెబ్బా పటేల్, నందిత శ్వేత

సంగీతం : శేఖర్ చంద్ర

నిర్మాత : పి.వి. రావ్

దర్శకత్వం : విని ఆనంద్

వైవిధ్య భరితమైన కథలను ఎన్నుకోవడంలో నిఖిల్ స్పెషలిస్ట్ అని నిఖిల్ చేసిన ప్రతి సినిమా చూస్తూ అనుకుంటూనే ఉన్నాం. అదే నిజమవుతూ నిఖిల్ చేసిన కొన్ని సినిమాలు వరుస హిట్లు సాధించాయి. స్వామిరారా.., కార్తికేయ, సూర్య vs సూర్య వంటి చిత్రాలు ఈ కోవకి చెందినవే. ఇలా వరుస హిట్లు మీదున్న నిఖిల్ తన జోనర్ వదిలి చేసిన సినిమా శంకరాభరణం. శంకరాభరణం సినిమాతో నిఖిల్ ఘోరమైన ప్లాపుని చవి చూసాడు. దీనితో తాను చేసిన తప్పేమిటో తెలుసుకుని నిఖిల్ మళ్ళీ తన పాత జోనర్ కి ప్రాముఖ్యతనిచ్చి.... ఎక్కడికి పోతావు చిన్నవాడా తో మనముందుకొచాడు. నిఖిల్ కి హిట్ ఇచ్చిన జోనర్లోనే ఈ మూవీ ఉండబోతుందంటూ ట్రైలర్స్, టీజర్స్ లో మనకి తెలిసిపోయింది. ఆత్మల కాన్సెప్ట్ తో వైవిధ్యభరితం గా ఈ సినిమా రూపొందిందని, నిఖిల్ ఈ సినిమాతో పక్కాగా మళ్ళీ హిట్ కొడతాడని తెలుగు ప్రేక్షకులు ఒక నమ్మకానికి వచ్చేసారు. మారానమ్మకం ఎంతవరకు నిజమైందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కథ: అర్జున్ (నిఖిల్) యానిమేషన్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. బాహుబ‌లి యానిమేష‌న్ కి సంబందించి వర్క్ చేస్తూంటాడు. అయితే అర్జున్ ఫ్రెండ్( వెన్నెల కిషోర్) కి ఏదో దెయ్యం పట్టిందనిపించి అతనికి బాగు చేయించడం కోసం మహిషాసుర మర్ధిని ఆలయానికి తీసుకెళ్లమని ఒక స్వామిజి చెప్తాడు. స్వామిజి మాట ప్రకారం అర్జున్, వెన్నెల కిషోర్ ని మహిషాసుర మర్ధిని గుడికి తీసుకెళ్తాడు. అక్కడ అర్జున్ కి అమ‌ల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఇక అర్జున్, అమలాని ప్రేమించడం మొదలు పెడతాడు. అయితే అమల నాలుగైదు రోజుల తర్వాత కనిపించదు. ఇక అర్జున్ కూడా హైదరాబాద్ తిరిగి వచ్చేస్తాడు. హైదరాబాద్ వచ్చాక తాను ప్రేమించింది ఒక ఆత్మని అని తెలుసుకుని కంగారు పడతాడు. అయితే మళ్ళీ అమల అర్జున్ కి తారసపడింది. ఆమె అమల అనుకునేంతలోపల తన పేరు నిత్య అని చెబుతుంది. ఈ కన్ఫ్యూషన్ లో అర్జున్ ఉండగా నేను అమ‌ల‌ని అని అత‌నికి పార్వ‌తి (నందిత శ్వేత‌) ఫోన్ చేస్తుంది. మరి నిజంగానే పార్వతినే అమలా? అసలు ఈ అమల ఎవరు? అమలకి, అర్జున్ కి ఉన్న సంబంధం ఏమిటి? ఆత్మా హెబ్బా రూపంలోకి ఎలా వచ్చింది? అసలు ఆత్మ 21 గ్రాములే ఉంటుందా? అది సైంటిఫికిగ్గా ఎలా ప్రూవ్ అయింది? ఇంకా వెన్నెల కిషోర్ కి అసలు దెయ్యం పడితే దాన్ని వదిలించారా లేక అలానే ఉన్నదా? అనేది తెలుసుకోవాలంటే మాత్రం తెరమీద సినిమాని వీక్షించాల్సిందే.

పనితీరు: ఈ సినిమాలో నిఖిల్ పెరఫార్మెన్సు కి ఫుల్ మార్కులు పడిపోతాయి. నిఖిల్ తనదైన స్టయిల్లో నటించాడు. ఇక దర్శకుడు విఐ ఆనంద్ రొమాంటిక్ థ్రిల్లర్ నేపధ్యంలో ఎంటర్టైన్మెంట్ ని జోడించి ఈ కథను తీసాడు. కొంచెం కథనం లో పట్టులేకపోయినా కామెడీతో దాన్ని లాగించేసాడు. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే హెబ్బా పటేల్ మాత్రం గ్లామర్ డోస్ పెంచేసి నటించేసింది. గ్లామర్ పరం గా రెచ్చిపోయిందనే చెప్పాలి. ఇక పగను సాధించుకునే పార్వతి పాత్రలో నందిత కూడా బాగానే నటించింది. తన పాత్రకి న్యాయం చేసింది. ఇక అవికా గోర్ కూడా బురఖాలో ఒదిగిపోయి నటించింది. ఇక పాటల విషయానికొస్తే ఎక్కడికి పోతావు చిన్నవాడా పాటలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. అసలు పాటలెప్పుడొచ్చి ఎప్పుడెల్లాయో కూడా గుర్తుకి రావు. ఇక వెన్నెల కిషోర్ పాత్రకి పెద్దగా స్కోప్ ఉండదు. ఆర్ ఆర్ పర్వాలేదనిపించింది. ఇక ఈ సినిమాకి అతిపెద్ద మైన్స్ పాయింట్ రన్ టైం. బాగా సాగదీసేసాడు ఇంటర్వెల్ కి ముందు సినిమాని. స్క్రీన్ ప్లే మీద కాస్త దృష్టి పెట్టుంటే బావుండేది.

ఇక సినిమా లో ప్రేక్షకులకు నచ్చే విషయమైతే వుంది. మరి ప్రస్తుతం మోడీ పెద్ద నోట్ల రద్దు తతంగం ఎంతవరకు ఈ సినిమాని సక్సెస్ దారికి చేరుస్తుంది..... అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.

ప్లస్ పాయింట్స్: నిఖిల్, హీరోయిన్స్, దర్శకుడు, కామెడీ

మైనస్ పాయింట్స్: కథ, కథనం, పాటలు, క్లైమాక్స్, రన్ టైం

రేటింగ్: 2 .75 /5

Similar News