అంతరిక్షం షార్ట్ రివ్యూ

Update: 2018-12-21 04:00 GMT

ఫిదా, తొలిప్రేమ లాంటి ప్రేమ కథ చిత్రాలు చేస్తున్న వరుణ్ తేజ్.. ఘాజీ లాంటి హిట్ సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి తో అంతరిక్షం సినిమా చేసాడు. ఈ సినిమా స్పేస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. వరుణ్ తేజ్, అదితి రావ్ హైద‌రీ, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన ఈ సినిమాకి ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పూర్తి చేసుకుంది. ఓవర్సీస్ టాక్ చూస్తుంటే అంతరిక్షం కేవలం మల్టిప్లెక్స్ ఆడియన్స్ కి మాత్రమే ఉన్నట్టుగా కనబడుతుంది. చదుకున్నవాళ్ళకి తప్ప ఈ సినిమా బిసి సెంటర్స్ కి ఎక్కేలా లేదంటున్నారు. ఇక ఓవర్సీస్ టాక్ ప్రకారం అంతరిక్షం ఎలా ఉంది అంటే....

దేవ్ (వరుణ్ తేజ్) అనే వ్యోమోగాని.. పరిస్దితులు సహకరించకపోవటంతో గత ఐదేళ్లుగా తన మిషన్ ని కంప్లీట్ చేయలేకపోతాడు. ఈ లోగా అతనికి ఓ శాటిలైట్ లో వచ్చిన సమస్యను పరిష్కరించటానికి ఎంపిక చేయబడతాడు. ఆ సమస్యను పరిష్కరించకపోతే ప్రపంచవ్యాప్తంగా కమ్యునికేషన్ బంద్ అయ్యిపోతుంది. దాంతో ఆ పనిమీద స్పెస్ లోకి వెళ్లిన దేవ్ టీమ్ ఊహించని పరిణామాలను ఎదుర్కొంటుంది. వాటిని ఆ టీమ్ ఎలాపరిష్కరించుకుందనే విషయం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ లోగా దేవ్ తీసుకున్న ఓ నిర్ణయం మొత్తం టీమ్ ని షాక్ కు గురి చేస్తుంది. అసలు దేవ్ తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి. చివరకు ఆ శాటిలైట్ ని సెట్ చేసి కమ్యునికేషన్ సిస్టమ్ ని సెట్ చేసారా లేదా అనేది తెలుగు పోస్ట్ పూర్తి రివ్యూ లో చూద్దాం.

అంతరిక్షం ఆసాంతం ఇంట్రస్టింగ్ గానే ఉన్నా స్లో నేరేషన్ కాస్త ఇబ్బంది పెట్టిందని చెప్తున్నారు. ఇక సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ప్లస్ అయ్యిందని... ఘాజీ స్దాయిలో పోల్చుకుంటే అంతరిక్షంకి అంత లేదంటున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ ఆకట్టుకునేలా ఉందని... ఇలాంటి సినిమాలకు కీలకంగా నిలవాల్సిన విఎఫెక్స్... లో పస లేదంటున్నారు. అంతరిక్షానికి విఎఫ్ఎక్స్ టీమ్ అద్బుతమైన స్దాయిలో అవుట్ పుట్ ఇవ్వలేదని చెప్తున్నారు. మరి ఓవర్సీస్ టాక్ ఇలా ఉంటె... తెలుగు ప్రేక్షకుల అంతరిక్షం టాక్ ఎలా ఉందొ మరికొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది

Similar News