వకీల్ సాబ్ రివ్యూ

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతిహాసన్ (గెస్ట్ రోల్), నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్, ముకేశ్రిషి, ఆదర్శ్, [more]

Update: 2021-04-10 04:07 GMT

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్
నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతిహాసన్ (గెస్ట్ రోల్), నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్, ముకేశ్రిషి, ఆదర్శ్, మీర్ తదితరులు
సంగీతం:  ఎస్.ఎస్.థమన్
ఫోటోగ్రఫీ:  పి.ఎస్.వినోద్
సమర్పణ:  బోనీకపూర్
నిర్మాత:  దిల్ రాజు
దర్శకత్వం: వేణు శ్రీరామ్
పవర్ స్టార్ ఆ పదం లో ఏదో తెలియని వైబ్రేషన్స్. పెద్దవాళ్ళ దగ్గరనుండి చిన్న పిల్లలవరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎనకలేని క్రేజ్. స్టైల్, యాటిట్యూడ్, మేనరిజమ్స్ తో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసే పవన్ కళ్యాణ్ రాజకీయాల వైపు వెళ్లడంతో నటుడిగా ఆయనకో రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఆపై రీ ఎంట్రీ కోసం ఏరి కోరి హిందీ హిట్ ఫిలిం పింక్ రీమేక్ ని ఎంచుకుంటే కరోనా సృష్టించిన కలకలం ఇంకో వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చింది. మొత్తానికి మూడేళ్లకు పైగా వెండితెరకు దూరమైన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు నేడు (ఏప్రిల్ 9 ) వకీల్ సాబ్ గా తన వాదన వినిపించడానికి అభిమాన ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమయ్యారు. చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతోన్న బిగ్ లీగ్ హీరో సినిమాగా వకీల్ సాబ్ తో అందరిలోనూ రేకెత్తిన అంచనాలను అందుకోగలిగారా..? వకీల్ సాబ్ గురించి సమీక్షలో తెలుసుకుందాం. 

కథ:
 జాబ్స్ చేసుకుంటూ ఒకే ఫ్లాట్ లో కలిసుండే పల్లవి (నివేద థామస్), జరీనా (అంజలి), దివ్య (అనన్య) అనే ముగ్గురు మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఒకానొక సందర్భంలో కొందరు అబ్బాయిలని కలిస్తే, ఆ కుర్రాళ్ళు ఈ అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే పల్లవి ఏం చేసింది, ఎందుకు ఈ ముగ్గురు అమ్మాయిలు కోర్టులో ముద్దాయిలుగా నిలబడాల్సి వచ్చింది, వారిని ఆ కేసునుంచి బయటకు తేవడానికి – వనితల హక్కుని తెలియచెప్పడానికి డిఫెన్స్ లాయర్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) ఎలా పోరాడాడు అన్నదే క్లుప్తంగా వకీల్ సాబ్ కథ. 

పెరఫార్మెన్సు:
 నటనలో ఎంతో పరిణితి చెందిన పవన్ కళ్యాణ్ నటనను మనకు పరిచయం చేస్తుంది లాయర్ సత్యదేవ్ పాత్ర. క్యాంపస్ స్టూడెంటుగా, ప్రేమికుడిగా, భర్తగా, తాగుబోతుగా, అడ్వకేటుగా, ప్రతి యాంగిల్ లోనూ తనదైన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంటూ వింటేజ్ పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అనిపించారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ లో పవన్ పెరఫార్మెన్స్ హైలైట్ అని చెప్పాలి. తన ఆర్గ్యుమెంట్ గట్టిగా వినిపిస్తూనే అసలు ఎంటర్టైన్మెంట్ కే స్కోప్ లేని ఆ స్పేస్ లో తన మార్క్ చమక్కులతో అలరించారు పవన్. ఇక యాక్షన్ సీన్స్ లో పవన్ చూపించే పవర్ తెలిసిందే కదా. హీరోయిన్ విషయానికి వస్తే నివేదా థామస్, అంజలి ఎవరికీ వారే పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రకాష్ రాజ్ ఆ లాయర్ క్యారెక్టర్ కి అదనపు బలం అయ్యారు. ఇప్పటికే బెస్ట్ పెరఫార్మెర్స్ గా ప్రూవ్ చేసుకున్న ఆయన మరోసారి అలవోకగా ది బెస్ట్ ఇచ్చారు. అనన్య, ఆదర్శ్, ముకేశ్ ఋషి, మీర్ తదితరులు అందరూ కూడా వారి పాత్రలకు న్యాయం చేసారు.

సాకేతికంగా:
టెక్నీషియన్స్ వైజ్ ఫస్ట్ చెప్పాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించే. తాను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అంటూ ఓపెన్ గానే చెప్పుకున్న థమన్ తన అభిమానాన్ని వీలైనంత ప్రదర్శించే ప్రయత్నం చేసాడు. పాటలవరకూ ఆ కథకి తగ్గ అవుట్ పుట్టే ఇచ్చినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి  మాత్రం థియేటర్స్ దద్దరిల్లాయి. పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ కోర్ట్ రూమ్ డ్రామాని కరెక్ట్ వేలో ప్రోజెక్టు చేసింది. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, మతాల రచయిత తిరు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు వకీల్ కేస్ గెలవాలని తమ తోడ్పాటు అందించారు. 

డైరెక్టర్: 
ఓ మై ఫ్రెండ్ తో ఫెయిల్యూర్ నీ, ఎమ్ సి ఏ తో ఎబోవ్ యావరేజ్ నీ చుసిన వేణు శ్రీరామ్ ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో బాగానే కష్టపడ్డాడు. పింక్ వంటి కాంప్లికేటెడ్ కథనీ.. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ నీ ఎట్ ఎ టైం డీల్ చెయ్యడం టఫ్ జాబ్ అయినప్పటికీ అటు స్టోరీలోని సోల్ చెడకుండా ఇటు పవన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ్వకుండా మ్యాగ్జిమమ్ ట్రై చేసాడు. 

ప్రొడ్యూసర్:
పవన్ తో సినిమా నా డ్రీమ్ అని ఎప్పట్నుంచో చెబుతూ వస్తోన్న నిర్మాత దిల్ రాజు విష్ వకీల్ సాబ్ తో నెరవేరింది. దిల్ రాజు వాళ్ళ లాయర్ సత్యదేవ్ వంటి మెమొరబుల్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ దరిచేరింది.

విశ్లేషణ:
తప్పుడు కేస్ లో ఇరుక్కుని నిస్సహాయ స్థితిలో నిలబడ్డ ఆడపిల్ల కోసం ఓ ముసలి లాయర్ ముందడుగు వెయ్యడం, కోర్టులో ఫైట్ చేసి విమెన్ రైట్ ని ప్రూవ్ చేయడం అనేది పింక్ స్టోరీలోని సోల్. ఆ కథకి తమిళ్ లో కాస్త సాంబార్ ఫ్లేవర్ మిక్స్ చేస్తే మనోళ్లు ఏకంగా దాన్నే దమ్ బిర్యానీలా మార్చేశారు. పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ నుంచే చెవులు హోరెత్తిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మొదలెట్టి వీలున్న ప్రతి సీన్ కీ, వీలు చూసుకుని మరీ తీసుకున్న ప్రతి షాట్ కీ విపరీతమైన ఎలివేషన్ ఇచ్చుకున్నారు. దాంతో కథలో ఇన్ సెక్యూరిటీ అనేదే లేకుండా పోయింది. మెయిన్ డ్రామాలోని ఇంటెన్సిటీ మిస్ అయింది. ముఖ్యంగా పవన్ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కథలో సరిగా ఇమడలేదు. అంతకుమించిన కంపేరిజన్స్ తో స్పాయిలర్స్ రాయడం కరెక్ట్ కాదు కనుక వదిలేద్దాం కానీ కొన్ని మాత్రం ప్రస్తావించి తీరాలి. టైటిల్ వకీల్ సాబ్ అయినందుకు అనుకుంటా.. సినిమాలోని ప్రతి పాత్ర పవన్ ని వకీల్ సాబ్ అని పిలిచేస్తూ ఉంటుంది. సరే వేరే పాత్రలైతే సరిపెట్టుకోవచ్చు కానీ సాటి లాయర్లు కూడా అలాగే పిలవడం, ప్రాసిక్యూట్ చేసే ప్రకాష్ రాజ్ కూడా నందా అని పిలిపించుకుంటూ పవన్ రోల్ కి పేరు లేనట్టు వకీల్ సాబ్ అనడం మరీ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలాగే ఎవరికి ఏ అన్యాయం జరిగినా డైరెక్ట్ గా ఈ వకీల్ సాబ్ దగ్గరికే వచ్చెయ్యడం, ఎంపీ రేంజ్ వ్యక్తి ఈ వకీల్ సాబ్ పేరు వినగానే భయపడిపోవడం, వకీల్ డైరెక్ట్ గా వెళ్లి వార్నింగ్ లు ఇచ్చెయ్యడం అన్నీ ఆర్టిఫీషియల్ గా అనిపిస్తాయి. ఇరికించిన ఫైట్లు, అతికించిన మాటలు అయితే కోకొల్లలు. చివరిగా సాక్ష్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే కోర్టు ఆ పద్దతి పక్కనెట్టి మరీ తీర్పునిచ్చిన తీరు మీకు కన్విన్సింగ్ గా అనిపించలేదు అంటే దానికి కారణం వాదనలో సరైన పదును లేదనే ఫీలింగ్ కలగడమే. ఈ వకీల్ సాబ్ యాక్షన్ సీన్స్ లో కీళ్లు విరగ్గొడుతూ – కోర్ట్ లో సెక్షన్స్ చెప్పి అదరగొడుతూ ఫ్యాన్స్ ని బాగానే అలరించాడు. అయితే ఈ సినిమాకి అసలైన టార్గెట్ ఆడియన్స్ లేడీస్. మరి ఆ మహిళా ప్రేక్షకుల స్పందన పైనే అల్టిమేట్ రిజల్టు, రేంజు ఆధారపడి ఉంటాయి.
 రేటింగ్: 3.0/5

Tags:    

Similar News