ఉప్పెన మూవీ రివ్యూ

ఉప్పెన మూవీ రివ్యూబ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ నటీనటులు: వైష్ణవ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల, సాయి చాంద్, రాజశేఖర్ తదితరులు.మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ [more]

Update: 2021-02-12 09:57 GMT

ఉప్పెన మూవీ రివ్యూ
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ 
నటీనటులు: వైష్ణవ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల, సాయి చాంద్, రాజశేఖర్ తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటర్: నవీన్ నూలి 
సినిమాటోగ్రఫీ: శాందత్
నిర్మాతలు: సుకుమార్, Y. రవి శంకర్, Y. నవీన్ 
దర్శకత్వం: బుచ్చి బాబు సానా
మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన బుచ్చిబాబు సాన.. వైష్ణవ తేజ్ ని తెరకి పరిచయం చేస్తున్నాడు. మైత్రి మూవీస్ వంటి బిగ్ బ్యానర్ ద్వారా ఇండస్ట్రీకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నాడు వైష్ణవ తేజ్. కరోనా కి ముందు విడుదల కావాల్సిన ఉప్పెన ఏడాదికి ఇప్పుడు థియేటర్స్ లో విడుదల చేసారు నిర్మాతలు. సినిమాపై ఉన్న నమ్మకం, మేగా హీరో వైష్ణవ తేజ్ కావడంతో నిర్మాతలు సినిమాపై హోప్స్ పెట్టుకుని ఓటిటి సంస్థలు ఎంతగా టెంప్ట్ చేసినా లొంగకుండా చివరికి థియేటర్స్ లోనే విడుదల చేసారు. ఇక సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ లోను మంచి అంచనాలే ఉన్నాయి. లీడ్ పెయిర్ బావుండడం, కృతి శెట్టి లుక్స్, విలన్ విజయ్ సేతుపతి , దేవిశ్రీ మ్యూజిక్ పై ఉన్న అంచనాలతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. భారీ ప్రమోషన్స్ మధ్యన నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు టచ్ చేసిందో సమీక్షలో చూసేద్దాం.
కథ:
మత్స్యకారుడు (సాయి చంద్) కుమారుడు ఆశిర్వాదం ఆశి (వైష్ణవ్ తేజ్) చిన్నప్పటి నుంచీ భూస్వామి శేషారాయనం (విజయ్ సేతుపతి) కూతురు సంగీత అకా బేబమ్మ (కృతి శెట్టి) ప్రేమలో ఉంటాడు. బేబమ్మ కూడా కాలేజ్ కి బస్సు లో వెళుతూ ఆశి ని ప్రేమిస్తుంది. తండ్రికి తెలియగానే బేబమ్మ – ఆశి ఊరి నుండి పారిపోతారు. పరువు కోసం ప్రాణం పెట్టే శేషారాయనం.. తన కూతురు వల్ల తన పరువు పోతుంది అని తన కూతురు బేబమ్మ ఇంట్లోనే ఉంది అంటూ ఊరి జనాలను నమ్మిస్తాడు. మరి శేషా రాయనం ఈ ఆరు నెలలో కూతురు బేబమ్మ – ఆశి ని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలేమిటి? అసలు బేబమ్మ ఇంటికి తిరిగి వస్తుందా? ఆశిని శేషారాయనం ఏం చేసాడు? ఆశి – బేబమ్మ ప్రేమ గెలిచిందా? అనేది ఉప్పెన స్టోరీ.
పెరఫార్మెన్స్:
వైష్ణవ తేజ్ లుక్స్ పరంగా పేద కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. స్క్రీన్ మీద వైష్ణవ తేజ్.. అనుభవం ఉన్న హీరోల పెర్ఫర్మ్ చేసాడు. ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ కృతి శెట్టి అందంగా అదరగొట్టేసింది. కృతి శెట్టి నటనతోను ఆకట్టుకుంది. సంగీత పాత్రకి ప్రాణం పోసింది. వైష్ణవ తేజ్ – కృతి శెట్టి కాంబో సీన్స్ హైలెట్ అనేలా ఉన్నాయి. క్లైమాక్స్ సీన్స్ లో కృతి శెట్టి అనుభవం ఉన్న హీరోయిన్స్ లా ఎమోషనల్ గా అదరగొట్టేసింది. ఇక ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ విలన్ పాత్రధారి విజయ్ సేతుపతి. రాయనం పాత్రకి పర్ఫెక్ట్ గా సూట్ అవడమే కాదు.. విజయ్ సేతుపతి నటనకి ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండదు. మిగతా నటులు పరిధి మేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
దర్శకుడు బుచ్చి బాబు చెప్పినట్లుగా మట్టి కథలకు స్వచ్ఛత ఉంటుంది. అదే ఉప్పేన ప్రేమ కథలో స్వచ్ఛత ఉంది. ధనిక -పేద అనే కాన్సెప్ట్ ఎన్నో సినిమాల్లో చూసినవే అయినా.. దాన్ని తెర మీద చూపించే విధానమే ఆ సినిమాల సక్సెస్ కి కారణం. పేదింటి అబ్బాయిని.. పెద్దింటి అమ్మాయి ప్రేమించడం.. ఆ ప్రేమని చంపెయ్యడానికి పెద్దవాళ్ళు బయలుదేరడం, వీలుకాకపోతే ప్రేమికులనే చంపేసే పగతో రగిలిపోయే ధనిక కథలు ఎన్నో ఎన్నెన్నో సినిమాల్లో చూసేసాం. అయితే ఇక్కడ ఉప్పెన విషయంలో దర్శకుడు ప్రేమ అనేది శారీరక సంబంధం గురించి కాదు అని చెప్పే ప్రయత్నం చేసాడు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్స్ ఒకరినొకరు చూసుకోవడం, మనసులని ఇచ్చిపుచ్చుకోవడం, ప్రేమించుకోవడం, ఆ ప్రేమ ఇంట్లో వాళ్ళకి తెలియడం వంటి సన్నివేశాలతో నింపేసాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఊరి నించి పారిపోవడం, వారిని వెతకడానికి హీరోయిన్ తండ్రి విలన్ మనుషులు వెంటబడడంతో సెకండ్ హాఫ్ ని డిజైన్ చేసాడు. కొన్ని సాగదీత సన్నివేశాలు అడ్డం పడినా.. ప్రీ క్లయిమాక్స్ నుండి సినిమా ఊపందుకుంది. బెబమ్మ ఇంటికి రావడం.. తండ్రితో మట్లాడడం వంటి సన్నివేశాలకు ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అయినా.. విజయ్ సేతుపతి పాత్ర అప్పటివరకు భయంకరంగా ఉండి.. అప్పుడు వీక్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇక క్లయిమాక్స్ విషయంలో ప్రేక్షకుడి ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడకుండా దర్శకుడు చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినది. రొటీన్ క్లైమాక్స్ కి భిన్నంగా అనిపిస్తుంది ఉప్పెన క్లైమాక్స్. ఇక సినిమాలో స్వచ్ఛమైన ప్రేమ కథని సముద్రం నేపథ్యంలో చూపించడం అద్భుతంగా అనిపిస్తుంది.
సాంకేతికంగా:
లీడ్ పెయిర్ వైష్ణవ తేజ్ – కృతి శెట్టి అదిరిపోయే నటన, విజయ్ సేతులపతి విలనిజంతో \పాటుగా ఈ సినిమాలో మరో మెయిన్ అస్సెట్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ప్రేక్షకుడు బోర్ అని ఫీలయినప్పుడల్లా.. మనకు బోరింగ్ పాటలు మరియు నేపథ్య సంగీతం ఉపశమనం ఇస్తుంది. శందత్ తన స్లో మోషన్ విజువల్స్ తో ప్రేమకథకు అందాన్ని తెచ్చిపెట్టాడు. నవీన్ నూలీ యొక్క ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో బాగానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. అవి కట్ చెయ్యాల్సింది. మైత్రి మూవీ మేకర్స్ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి రిచ్ నెస్ ని తెచ్చిపెట్టాయి.
రేటింగ్: 2.5/5

Tags:    

Similar News