తేజ్ ఐ లవ్ యూ మూవీ రివ్యూ

Update: 2018-07-06 08:53 GMT

నటీనటులు: సాయి ధరమ్ తేజ్., అనుపమ పరమేశ్వరన్, జోష్ రవి, వైవా హర్ష, పవిత్ర లోకేష్, పృథ్వి రాజ్, సురేఖ వాణి తదితరులు

సినెమాటోగ్రాఫి: ఆండ్రూ

ఎడిటింగ్: ఎస్ ఆర్ శేఖర్

మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్

నిర్మాత: కె ఎస్ రామారావు

దర్శకత్వం: కరుణాకరన్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకోవడానికి తాపత్రయపడుతున్నాడు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతగా ఉన్నా అతనికి హీరో లక్ ఉంటేనే ఇండస్ట్రీలో సెటిల్ అవుతాడు గానీ... లక్కు లేకుండా టాలెంట్ లేకుండా మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో హీరోగా చేద్దామంటే కుదిరే పని కాదు. అయితే మెగా మేనల్లుడికి మంచి టాలెంట్ ఉంది. నటనలోనూ, డాన్స్ ల్లోనూ సాయి ధరమ్ కి మంచి టాలెంట్ ఉంది. ఏంటో ఎనర్జిటిక్ గ కనిపించే సాయి ధరమ్ కి వరసగా పరాజయాలు ఎదురవుతన్నాయి. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి సినిమాలు యావరేజ్ హిట్స్ అయినప్పటికీ... సాయి ధరమ్ కి మంచి పేరొచ్చింది. కానీ సాయి ధరమ్ కూడా స్టార్ హీరోగా ఎదిగే క్రమంలో ఒత్తిడికి లోనవుతున్నట్టుగా ఈ మధ్య అతని సినిమాలు చూస్తుంటే అనిపిస్తుంది. సాయి ధరమ్ తేజ్ లావు పెరగడం.. చూస్తుంటే తన మీద తనకి కాన్ఫిడెన్స్ కోల్పోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇంటిలిజెంట్ సినిమాతో ఘోరంగా దెబ్బతిన్న సాయి ధరమ్ తే ప్రస్తుతం ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యూ సినిమా చేసాడు. ఇక దర్శకుడు కరుణాకరన్ కూడా అంత క్రేజ్ లో లేదు. ఆయన సినిమాలు వరస పరాజయాలు. అయినా కరుణాకరన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి. కరుణాకరన్ ఎంతో అద్భుతంగా ప్రేమ కావ్యాలను ప్రేక్షకులకు ప్రెజెంట్ చేస్తాడు అనే నమ్మకం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలిప్రేమ ఎంత బిగ్గెస్ట్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ లోని క్లాస్ అందరికీ పరిచయం అయ్యింది. మరి మావయ్యకి హిట్ ఇచ్చిన కరుణాకరన్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ కి ఈ తేజ్ ఐ లవ్ యూ తో ఎలాంటి హిట్ ఇచ్చాడో చూద్దాం. ఇక గతంలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి పెద్ద నిర్మాతగా ఉన్న కే.ఎస్ రామరావు చాన్నాళ్ళకి ఇలా ఒక మీడియం బడ్జెట్ తో సినిమా చేసాడు. మరి కె.ఎస్ రామారావుకి, కరుణాకరన్ కి, సాయి ధరమ్ తేజ్ కి హోల్సేల్ గా ముగ్గురికి ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కావాలి. మరి ముగ్గురు ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకున్నారో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన తేజ్ (సాయి ధరమ్ తేజ్) పెద్దమ్మ, పెదనాన్న, బాబాయిల దగ్గర పెరుగుతుంటాడు. రూల్స్ కి అంటే పద్దతికి ప్రాణమిచ్చే కుటుంబంలో పుట్టినప్పటికీ... కొన్ని కారణాల వలన కుటుంబానికి దూరమై తన చిన్నాన్న దగ్గర చదువుకుంటుంటాడు తేజ్. ఒకేసారి చదువులో పాస్ కాకుండా సప్లీస్ కట్టుకుంటూ.. అక్కడే కొంతమంది ఫ్రెండ్స్ ని పోగు చేసుకుని ఒక రాక్ బ్యాండ్‌ని ఏర్పాటు చేసుకుని అందరు కలిసి ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆ సమయంలోనే అనుకోకుండా తేజ్ కి నందిని( అనుపమ) పరిచయమవుతుంది. అయితే నందిని కి వచ్చిన ఒక సమస్య వలన తేజ్ ఆమెకి బాయ్ ఫ్రెండ్ గా నటించాల్సి వస్తుంది. అదే విధంగా కొన్నాళ్ళకి నందిని కూడా తేజ్ కి గర్ల్ ఫ్రెండ్ గా నటించాల్సి వస్తుంది. అలాంటి సమయంలోనే ఇద్దరి మధ్యలో లవ్ క్రియేట్ అవుతుంది. కానీ ఎవరూ పైకి చెప్పారు. ఈ లోపు నందినికి యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోవడంతో.. తేజ పరిస్థితి ఏమిటి? అసలు తేజ్ తన ఫ్యామిలీ నుండి ఎందుకు బయటికి వస్తాడు? నందినికి బాయ్ ఫ్రెండ్ గా నటించాల్సిన అవసరం తేజ్ కి ఎందుకు వస్తుంది? అసలు నందినిని ఫాలో అవుతున్నది ఎవరు? నందినికి గతం గుర్తొచ్చి తేజ్ ని ప్రేమిస్తున్నాని చెబుతుందా..? అసలు తేజ్ కి నందినికి పెళ్లవుతుందా? అనే అనేక రకాల ప్రశ్నలకు తేజ్ ఐ లవ్ యూ సినిమా చూస్తేనే క్లారిటీ వస్తుంది.

నటీనటుల నటన:

తేజ్ గా సాయి ధరమ్ తేజ్ తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే డాన్స్ లు బాగా చేసి మెప్పించాడు. కాకపోతే సాయి ధరమ్ ఫిట్నెస్ పూర్తిగా వదిలేసినట్టుగా కనబడుతున్నాడు. బాగా లావై కాస్త ఎబ్బెట్టుగానే కనిపించాడు. ఇక ఆకతాయి కుర్రాడిగా.. పద్ధతులంటే పడి చచ్చే కుటుంబంలో పుట్టి వాటిని పాటించకుండా పనిష్మెంట్ కి గురయ్యి.. బాబాయ్ ఇంట్లో ఆశ్రయం పొందుతూ అక్కడ కూడా అల్లరిచిల్లరిగా తిరిగే బ్యాచ్ తో కలిసి రాక్ బ్యాండ్‌ ఏర్పాటు చేసి గిటార్ పట్టుకుని తిరిగే కుర్రాడిలా సాయి ధరమ్ పర్ఫెక్ట్ గా ఆకట్టుకున్నాడు. అలాగే అనుపమ కి బాయ్ ఫ్రెండ్ గా నటిస్తూనే ఆమెని ప్రేమించే అబ్బాయిగా సాయి అదరగొట్టేసాడు. అలాగే తన రెండో మావయ్య నాగబాబుని సాయి ధరమ్ బాగా ఇమిటేట్ చేసాడు. ఇక నందినిగా అనుపమ క్యూట్ లుక్స్ తో చంపేసింది. సాయి కి గర్ల్ ఫ్రెండ్ గా యాక్టింగ్ చేస్తూనే అతని ప్రేమలో పడిపోయి.. పైకి చెప్పలేని ఎక్స్ ప్రెషన్స్ ని అనుపమ పరమేశ్వరన్ బాగా పలికించింది. నేచురల్ నటనతో క్యూట్ క్యూట్ గా ఆకట్టుకుంది. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో అనుపమ నటన పీక్స్ లో ఉంది. ఇక సినిమాలో వైవా హర్ష చేసిన కామెడీ సీన్స్ బావున్నాయి. ఇక మిగతా కెరెక్టర్స్ అంతా సో సోగానే నటించి ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

దర్శకుడు కరుణాకరన్ లవ్ ట్రాక్ తో కూడుకున్న కథలను ఎంతో బాగా హ్యాండిల్ చేసే సత్తా గల దర్శకుడు. ప్రేమ కథలకు పెట్టింది పేరు. కానీ కరుణాకరన్ కూడా పూర్తి రొటీన్ ట్రాక్లోనే ఉన్నాడు. తేజ్ ఐ లవ్ యూ అనే ప్రేమ కథ చిత్రాన్ని సాయి ధరమ్ తేజ్ - అనుపమ జంటగా తెరకెక్కించాడు. కానీ తేజ్ ఐ లవ్ యూ కథ మనం ఎన్నో సినిమాల్లో చూసేశాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కథ మరీ రొటీన్ గా ఉండంతో ప్రేక్షకుడు బాగా బోర్ ఫీల్ అయ్యాడు. హీరోయిన్‌ను చూసి ప్రేమలో పడటం.... వారిద్దరూ ఒకరిపై మరొకరు రివేంజ్ తీర్చుకోవడంతో ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది. తొలి భాగంలో ఎక్కడా మనసును కట్టి పడేసే సన్నివేశాలు లేకున్నా బోరుగా ఫీలవకుండా చూడటం వరకు దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో కాస్త కామెడీతో ప్రేక్షకులను దర్శకుడు కట్టిపడేసాడు. కానీ సినిమా పూర్తవుతున్న కొద్దీ... బాగా డ్రాప్ అవుతూ వచ్చింది. ఒక సీన్ కాకపోతే మరొక సీన్ అయినా హైప్ క్రియేట్ అవుతుంది... ఏదో ఒక ట్విస్ట్ తో సినిమా కథ మలుపు తిరుగుతుంది అని అనుకున్న ప్రేక్షకుడికి ప్రతి సీన్ నిరాశే మిగులుస్తుంది. హీరో ప్రేమకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేందుకు వచ్చిన హీరోయిన్ యాక్సిడెంట్‌కు గురై గతాన్ని మర్చిపోతుందనే ఇంటర్వెల్ ట్విస్ట్‌ తో దర్శకుడు ఆడియెన్స్‌ లో క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశాడు. కానీ సెకండాఫ్‌‌‌ మరింత గ్రిప్పింగ్‌గా, ఆకట్టుకునేలా ఉంటే బాగుండేది. కానీ ఎక్కడా అబ్బో అనే ఫీలింగ్ తెచ్చిన సందర్భం సెకండ్ హాఫ్ లో కనబడదు. ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రి క్లమాయిక్స్‌ లో ఫ్యామిలీ సెంటిమెంట్‌ను పండించే ప్రయత్నంలో, భావోద్వేగాలతో కట్టి పడేయడంలో డైరెక్టర్ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ఇక హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ మాత్రం ఫుల్ బోర్ కొట్టించేసింది. సో కరుణాకరన్ మరోసారి రొటీన్ కథతో వచ్చి బోర్ కొట్టించడమే కాదు... ఫ్లాప్స్ లో ఉన్న హీరోకి మరో మరో ప్లాప్ తగిలించాడు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ పాటల మీద పెద్దగా కాన్సంట్రేట్ చేసినట్టుగా అనిపించలేదు. కేవలం అతని మ్యూజిక్ సినిమాకి ఓకె అన్నట్టుగానే ఉంది. ఈ సినిమాలో ఓకె ఒక్క పాట ఆకట్టుకునేలా అనిపిస్తుంది. నేపధ్య సంగీతం కూడా ఓ అన్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాకి మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ, ఆండ్రూ కెమెరా పనితనం ప్రతి ఫ్రెమ్ లోనూ కనబడుతుంది. అందమైన లొకేషన్స్ ని అంతే అందంగా తన కెమెరాలో బంధించాడు ఆండ్రూ. ఎడిటింగ్ విషయానికి వస్తే లాగింగ్ సీన్స్ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎడిట్ చెయ్యాల్సిన సీన్స్ బోలెడన్ని ఉన్నాయి. ఇక కె.ఎస్ రామారావుతో నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా కి నిర్మాణ విలువల విషయంలో వంక పెట్టడానికి లేదు. నిర్మాణ విలువలు కథానుసారంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: అనుపమ పరమేశ్వరన్ ఎక్స్ ప్రేషన్స్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: సాయి ధరమ్ తేజ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మ్యూజిక్, ఎడిటింగ్, రొమాంటిక్ ట్రాక్, కామెడీ సీన్స్, సాంగ్స్ ప్లేస్మెంట్

రేటింగ్: 2.0 /5

Similar News