ప్రెజర్ కుక్కర్ మినీ రివ్యూ

అమెరికా వెళ్లేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు వారి కోసం తల్లితండ్రులు పడుతున్న వేదన, ఇబ్బందులను దర్శకుడు కళ్ళకి కట్టినట్టుగా ఈ ప్రెజర్ కుక్కర్ సినిమాలో చూపించాడు. పిల్లల్ని [more]

Update: 2020-02-21 07:25 GMT

అమెరికా వెళ్లేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు వారి కోసం తల్లితండ్రులు పడుతున్న వేదన, ఇబ్బందులను దర్శకుడు కళ్ళకి కట్టినట్టుగా ఈ ప్రెజర్ కుక్కర్ సినిమాలో చూపించాడు. పిల్లల్ని అమెరికా పంపించాలనే తపనతో లక్షలు ఖర్చు చేస్తారు. అదే పిల్లలు అమెరికా వెళ్ళాక తల్లితండ్రుల ను పట్టించుకోకుండా ఉంటె.. అవసాన దశలో తమ దగ్గర పిల్లలు లేకపోతె పడే తపన, వేదన అంతా సినిమాలో చూపించారు. సుజయ్, సుశీల్ దర్శకులు ఈ సినిమాని నేటి పరిస్థితులకు అనుగుణంగా… అందరికి అర్ధమయ్యే రీతిలో కన్వే చేసారా.. లేదా…. అనేది సమీక్షలో చూద్దాం.

కిషోర్ ని అమెరికా పంపించాలని వాళ్ళ నాన్న కలలు కంటాడు, చిన్నప్పటినుండి అమెరికా వెళితే ఆలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అంటూ అమెరికా చిత్రపటాన్ని చూపిస్తూ పెంచుతాడు. అయితే కిషోర్ కూడా బిటెక్ చదివి అమెరికా వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ అమెరికా వెళ్ళడానికి పదే పదే వీసా రిజెక్ట్ అవుతుంది. దానితో బ్రోకర్ ద్వారా అమెరికా వెళ్ళడానికి ట్రై చేసి పది లక్షహాలు పోగొడతాడు. దానితో కిషోర్ తల్లితండ్రులు తల్లడిల్లిపోతారు. కానీ కిషోర్ పోగొట్టిన డబ్బుని ఇండియాలోనే సంపాదించి ఇచ్చేస్తానని చెప్పి తండ్రి తో ఛాలెంజ్ చేస్తాడు. మరి కిషోర్ ఛాలెంజ్ లో గెలిచాడా? అమెరికా వెళ్లి తండ్రి కల నిజం చేశాడా అనేది మిగతా కథ.

దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్ చాలా బావుంది.అమెరికా వెళ్ళాలి అనుకున్నవారు ఎన్ని అగచాట్లు పడుతున్నారో …డాలర్ల వేటలో అమెరికా వెళ్ళినవాళ్ళు తల్లితండ్రులను నిర్లక్ష్యం చెయ్యడం ని చక్కగా వివరించే ప్రయత్నం చేసాడు. కథ మొత్తం అమెరికా అనే కాన్సెప్ట్ చుట్టూనే తిరుగుతుంది. కిషోర్ పాత్రధారి సాయి రోనిక్ బాగా నటించడమే కాదు.. కథ నేపథ్యం బావుంది కానీ నీరసమైన కథనంతో వీక్ ఎమోషన్స్ తో సినిమా దెబ్బేసింది.

Tags:    

Similar News