ఆఫీసర్ యూఎస్ టాక్

Update: 2018-06-01 04:45 GMT

నాగార్జున - వర్మ కాంబోలో తెరకెక్కిన ఆఫీసర్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకప్పుడు శివ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వర్మ - నాగ్ ల కలయికతో తెరకెక్కిన ఆఫీసర్ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నప్పటికీ... రామ్ గోపాల్ వర్మ పైత్యంతో.. ట్రేడ్ లో ఆసక్తి సన్నగిల్లింది. వర్మ కి ఉన్న పైత్యం ఆఫీసర్ సినిమాని ఏం చేసేదో తెలియదు గాని... నాగార్జునకున్న క్రేజ్ ఎంతో కొంత కాపాడి ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో మైరా సరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆఫీసర్ సినిమా నిన్న అంటే గురువారం రాత్రి ఓవర్సీస్ లో బొమ్మ పడిపోయింది. మరి అక్కడినుండి అందిన ఆఫీసర్ టాక్ ఎలా ఉందొ చూసేద్దామా..

ఒక పాప కి తండ్రిగా నాగార్జున ఒక కేసును ఛేదించే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. తన పాపని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ ని నాగ్ పట్టుకోవడం కోసం భారీ యుద్ధమే చేస్తాడు. అసలు నాగార్జున తాను చేపట్టిన సిట్ ఆపరేషన్ లో తనని చంపడానికి కుట్రపన్నిన విలన్ గ్యాంగ్ చేసిన ప్రయత్నంలో నాగ్ అతని భార్యను కోల్పోతాడు. అక్కడినుండి విలన్ నారాయణ్ ను అరెస్ట్ చేయిస్తాడు నాగ్. అయితే తగిన సాక్ష్యాలు, అధరాలు లేక అతడు జైలు నుండి విడుదల చేయబడతాడు. ఇక అలా జైలు నుండి వచ్చిన నారాయణ కొద్దిగా సమయం తీసుకుని నాగార్జున కూతుర్ని కిడ్నాప్ చెయ్యడం... తన కూతుర్ని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్న నారాయన్ని నాగార్జున ఎలా పట్టుకున్నాడు అనేదే ఆఫీసర్ కథ. క్రైం ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగిన ఈ కథకి రవిశంకర్ ఇచ్చిన నేపధ్య సంగీతం చాలా బావుంది.

ఆఫీసర్ సినిమాలో దర్శకుడు వర్మ యాక్షన్ కు పెద్ద పీట వేయడంతో కామెడీ బూతద్దం పెట్టినా కనబడదు. సినిమా ఆసాంతం సీరియస్నెస్ తోనే కొనసాగుతుంది. ఇక వర్మ టేకింగ్ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో బాగా ఎలివేట్ అయింది. మొత్తంగా చూస్తే ఆఫీసర్ సినిమా నాగార్జున కెరీర్ లో మంచి చిత్రం గానే నిలుస్తుంది. నారాయణ్ పరిసా, అజయ్, షాయాజీ షిండే ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తారు. మరి ఎంటెర్టైమెంట్ ని అవాయిడ్ చేస్తూ కేవలం యాక్షన్, అండ్ ఎమోషన్ మాత్రమే కలగలిసివున్న ఆఫీసర్ పూర్తి రివ్యూ మరికాసేపట్లో....

Similar News