అర్జున్ సురవరం మూవీ రివ్యూ

బ్యానర్: మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి నటీనటులు: నిఖిల్‌ సిద్దార్థ్‌, లావణ్య త్రిపాఠి, తరుణ్‌ అరోరా, వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి, నాగినీడు తదితరులు మ్యూజిక్ [more]

Update: 2019-11-29 10:07 GMT

బ్యానర్: మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి
నటీనటులు: నిఖిల్‌ సిద్దార్థ్‌, లావణ్య త్రిపాఠి, తరుణ్‌ అరోరా, వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి, నాగినీడు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: సామ్ సి ఎస్
సినిమాటోగ్రఫీ: సూర్య
నిర్మాత: రాజ్ కుమార్ ఆకెళ్ళ
దర్శకత్వం: టీఎన్‌ సంతోష్‌

కార్తికేయ, స్వామి రారా, ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాల్తో యువ కెరటంలా దూసుకొచ్చిన నిఖిల్ కి అర్జున్ సురవరం పెద్ద పరీక్ష పెట్టింది. ఒక పక్క విడుదలకు నోచుకోకుండా ఏడాదిగా ఉన్న అర్జున్ సురవరం సినిమా తర్వాత టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ముద్ర గా నిఖిల్ సినిమా మొదలవ్వగా టైటిల్ వివాదంలో పడి చివరికిలా అర్జున్ సురవరం టైటిల్ తో కాంట్రవర్సీలకు నెలవుగా మారిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల డేట్స్ మార్చుకున్నప్పటికీ… నిఖిల్ చివరిలో సినిమాపై చేసిన ప్రమోషన్ అందరిలో ఆసక్తి పెరిగేలా చేసింది. మరి విడుదల వాయిదాల తో హైలెట్ అయిన నిఖిల్ అర్జున్ సురవరం సినిమా ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
అర్జున్ సురవరం( నిఖిల్) ఫ్యామిలీ కొన్నేళ్లుగా జర్నలిజం వృత్తిలోనే ఉంటుంది. అర్జున్ సురవరం కూడా టీవీ99 అనే ఛానల్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తుంటాడు. బీబీసీ ఛానెల్‌లో పనిచెయ్యాలి అనేది అతని గోల్. బీబీసీ ఛానల్లో జర్నలిస్ట్ కావాలని బాగా కష్టపడుతుంటాడు. ఒక స్ట్రింగ్ ఆపరేషన్ కోసం ఒక పబ్‌కి వెళ్లిన అర్జున్‌కి కావ్య(లావణ్య త్రిపాఠి) పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరి పరిచయం కాస్త పెరిగి ప్రేమగా మారుతుంది. ఆమెకి తాను బీబీసీలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నట్టు చెబుతాడు. కావ్యకి జర్నలిస్ట్ లంటే పడదు. అదే టైం లో ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేసే ఓ భయంకరమైన మాఫియా కథలోకి ఎంటర్ అవుతుంది. అసలు కావ్య జర్నలిజాన్ని ఎందుకు అస్సహించుకుంటుంది? మరి అర్జున్ ని కావ్య అర్ధం చేసుకుంటుందా? అసలు ఫేక్ స‌ర్టిఫికెట్‌ల భాగోతాన్ని అర్జున్ ప్ర‌పంచానికి ఎలా తెలియ‌జేశాడు? అనేదే మిగతా క‌థ‌.

నటీనటుల నటన:
అర్జున్ లెనిన్ సురవరంగా నిఖిల్ అద్భుతమైన నటనను కనబర్చాడు. సినిమా సినిమాకు పరిణితి చెందుతూ వచ్చిన నిఖిల్ ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చాడనే చెప్పాలి. ఎక్కడా కూడా పాత్ర పరిధిని దాటి నటించలేదు. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా కథలో భాగంగానే రావడంతో హీరోయిజం కూడా బాగానే పండింది.అలాగే లావణ్య త్రిపాఠి కూడా చాలా బాగుంది. నిఖిల్ – లావణ్య మధ్య కెమిస్ట్రీ కానీ కొన్ని కీలక సన్నివేశాల్లో కనబర్చిన నటన బాగున్నాయి. లావణ్య పాత్ర కూడా సినిమాకి కీలకంగా నిలిచింది. అలాగే నెగిటివ్ రోల్ లో కనిపించిన తరుణ్ అరోరా కమెడియన్ వెన్నెల కిషోర్ లు వారి పాత్రలకు సరైన న్యాయం చేశారు. మిగతానటీనటులు తమ పాత్రలపరిధి మేర నటించారు.

విశ్లేషణ:
క్రైం థ్రిల్లర్ కథలకి ప్రేక్షకుల నుండి ఆదరణ ఎప్పుడు బాగానే ఉంటుంది. తరవాత ఎం జరుగుతుందో, కథలో వచ్చే ట్విస్ట్ లతోనే సినిమా మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇక అర్జున్ సురవరం సినిమా పేరుకే తమిళ్ సినిమా కనితన్‌కి రీమేక్ గానీ.. సినిమా కథ మొత్తం తెలుగు నేటివిటికి అనుగుణంగా చాలానే మార్పులు చేసాడు దర్శకుడు. అర్జున్ సురవరం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తో మొదలవుతుంది. మొదటి సన్నివేశాలే సినిమా మీద ఆసక్తిని కలిగిస్తాయి. మొదటి 20 నిమిషాల వరకు కూడా ఛానెల్ బ్యాక్ డ్రాప్, హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్, రెండు పాటలతో నడిచిన సినిమాలో అప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. నకిలీ సర్టిఫికెట్స్ కేసులో నిఖిల్ అరెస్ట్ అవ్వడం అనే ట్విస్ట్ సినిమాలో బాగా పేలింది. ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా ఎంగేజింగ్‌గా సాగిన సినిమా సెకండాఫ్ మొత్తం కూడా అదే పాయింట్ పై నడవడంతో కొన్ని సీన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సీసీ టీవీ ఫుటేజ్‌లను వాడడం, పోలీస్ ఇంటరాగేషన్ లాంటివి మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటాయి. అయితే ఎమోషనల్ గా సెకండ్ హాఫ్ ప్రేక్షకులను హత్తుకుంటుంది. హీరో మరియు విలన్ ల మధ్య సాగే ఎపిసోడ్ లు కానీ సినిమాలోని కీలక అంశానికి సంబంధించిన ఒక్కో అంశం బయటకు రివీల్ అయ్యే సందర్భాలు కానీ దర్శకుడు సంతోష్ బాగా తెరకెక్కించారు. సెకండాఫ్ లో హీరోకి సంబంధం లేకుండా పెట్టిన చిన్న ఎపిసోడ్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. కాకపోతే విలన్ డెన్ లోకి హీరో ఈజీగా ఎంటరయిపోయి అతని డేటా బేస్‌ని కాపీ చెయ్యడం, ప్రీ క్లైమక్క్ష్ ఆకట్టుకున్నప్పటికీ… క్లైమాక్స్ ని కాస్త హడావిడిగా ముగించడం కాస్త నిరాశ కలిగించేదిలా ఉంది.

సాంకేతికంగా..
సామ్ సీఎస్ అందించిన పాటలు , బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. సూపర్ మ్యూజిక్ తో అదరగొట్టేసాడు. మ్యూజిక్ కన్నా ఎక్కువగా నేపధ్య సంగీతాన్ని 100 కి 100 మార్కులు ఇవ్వొచ్చు. సూర్య అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. అవి సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.

ప్లస్ పాయింట్స్: కథ, కథనం, కామెడీ సీన్స్, నిర్మాణ విలువలు, బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ లో సాగదీత సన్నివేశాలు, కమర్షియల్ హంగులు లేకపోవడం

రేటింగ్: 2.75/5

Tags:    

Similar News