సైరా మొదటి రివ్యూ

అక్టోబర్ 2 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా ఈసినిమా [more]

Update: 2019-09-29 07:04 GMT

అక్టోబర్ 2 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా ఈసినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ తో బయటకు వచ్చింది. రన్ టైం వచ్చేసరికి రెండు గంటల 50 నిమిషాల 50 సెకన్లు ఉండనుందని సమాచారం. మన సెన్సార్ రివ్యూ ఏమో కానీ ఓవర్సీస్ నుండి అప్పుడే మొదటి రివ్యూ వచ్చేసింది.

యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు భారీ చిత్రాల విడుదలకు రెండు మూడు రోజుల ముందే తన రివ్యూను భయటపెట్టేస్తాడు. సినిమాను చూసిన అతను సినిమా అద్భుతంగా ఉందని, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాబోతుందని చెప్పాడు. ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ చిత్రం అవుతుందని ట్వీట్ చేసాడు. అంతే కాదు ఈమూవీ నేషనల్ అవార్డు ఖాయం అని చెప్పాడు. రివ్యూ పాజటివ్ గా రావడంతో చిరు ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియా లో రచ్చ స్టార్ట్ చేసేసారు.

ఇక ఈమూవీ లో చిరు సరసన నయనతార, మరో ముఖ్య పాత్రల్లో తమన్నా, అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు నటించారు. సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేసినా ఈచిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు. దాదాపు 250 కోట్లు తో ఈమూవీ తెరకెక్కిన్న సంగతి తెలిసిందే

Tags:    

Similar News