' c/o సూర్య' షార్ట్ & స్వీట్ రివ్యూ

Update: 2017-11-10 03:47 GMT

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ త‌ర్వాత త‌న స్థాయికి త‌గిన హిట్ లేని సందీప్ కిష‌న్‌కు ఇప్పుడు కెరీర్ ప‌రంగా అర్జెంటుగా ఓ హిట్ సినిమా అవ‌స‌రం. న‌గ‌రం, న‌క్ష‌త్రం ఇలా ఎన్నో సినిమాలు చేస్తూన్నా అవ‌న్నీ డిజాస్ట‌ర్ల మీద డిజాస్ట‌ర్లు అవుతున్నాయి. లేటెస్ట్‌గా సందీప్ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన ద్విబాషా చిత్రం c/o సూర్య. ఇటీవ‌ల వ‌రుస హిట్ల‌తో గోల్డెన్‌గ‌ర్ల్‌గా పేరు తెచ్చుకున్న మెహ్రీన్ కౌర్ సందీప్ ప‌క్క‌న న‌టించిన ఈ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రెండు భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టాక్ ఎలా ఉందో షార్ట్ రివ్యూలో చూసేద్దాం.

ఫ‌స్టాఫ్‌:

సినిమా ఫ‌స్టాఫ్ అంతా ప్రేక్ష‌కుడు స్క్రీన్‌కు అతుక్కుపోయేలా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సుశీంద్ర‌న్ తెర‌కెక్కించాడు. సందీప్‌కిష‌న్ క్యారెక్ట‌ర్ డిజైన్ చేసుకున్న తీరు, నేచుర‌ల్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ తీర్చిదిద్దిన విధానం, క్రైం, స‌స్పెన్స్ మెయింటైన్ చేయ‌డం బాగుంది. ఓవ‌రాల్‌గా ఫ‌స్టాఫ్ మొత్తం డీసెంట్‌గా ఉంది. స్క్రీన్ ప్లే ఫ‌స్టాఫ్‌కే హైలెట్‌.

సెకండాఫ్‌:

కీల‌క‌మైన సెకండాఫ్‌కు వ‌స్తే ఫ‌స్టాఫ్‌లో మెయింటైన్ చేసిన గ్రిప్పింగ్ ఇక్క‌డ కాస్త స‌డ‌లింది. సందీప్ కిష‌న్‌కు - విల‌న్ గ్యాంగ్‌కు మ‌ధ్య వ‌చ్చే మైండ్‌గేమ్ స‌న్నివేశాలు బాగున్నాయి. క్రైం క‌థ‌లోనే స‌స్పెన్స్ మెయింటైన్ చేయ‌డం బాగుంది. ఓవ‌రాల్‌గా ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ అంచ‌నాలు కాస్త త‌గ్గిన‌ట్టే లెక్క‌.

ప్ల‌స్‌లు: (+)

- సందీప్ కిష‌న్ క్యారెక్ట‌ర్‌

- ఫ‌స్టాఫ్‌

- స్క్రీన్ ప్లే

- ద‌ర్శ‌క‌త్వం

మైన‌స్‌లు: (-)

- క‌మ‌ర్షియాలిటీ కోసం ఇరికించిన సాంగ్స్‌

- వ‌ర్క‌వుట్ కానీ కామెడీ

- రొటీన్ ఫార్మాట్‌కు భిన్నంగా ఉండ‌డం

ఫైన‌ల్‌గా...

ప్రీమియ‌ర్ షో టాక్ ప్ర‌కారం డీసెంట్ మూవీ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్‌.కామ్‌

Similar News